జీ తెలుగు అప్సర అవార్డ్స్, 20 సంవత్సరాల వేడుక..!

-

జీ తెలుగు 20 సంవత్సరాల మైలురాయిని చేరుకున్న నేపథ్యంలో… అదిరిపోయే ఈవెంట్ నిర్వహించింది. 20 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో అప్సర అవార్డ్స్… పేరుతో కొత్త కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఈవెంట్ కోసం బుల్లితెర తారలు, హీరోయిన్లు వచ్చి సందడి చేశారు. ఇక ఈ ఈవెంట్లో అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలకు ప్రత్యేకంగా అవార్డులు కూడా ప్రధానం చేయడం జరిగింది. ఈ ఈవెంట్ లో అక్కినేని అమల… సమక్షంలో సమంత 15 ఏళ్ల సినీ ప్రయాణాన్ని కూడా చూపించారు. ఈ 15 సంవత్సరాల సినీ ప్రయాణాన్ని అక్కినేని అమల చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి ఎనర్జిటిక్​ యాంకర్స్​ సుధీర్​, రవి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ కార్యక్రమంలో డ్రామా జూనియర్స్ పిల్లలు చిరంజీవి, బాలకృష్ణ గెటప్‌లో వేదికపైకి వచ్చి ప్రముఖ నటి రోజాకు అవార్డు అందించారు. జయప్రద, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడితో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని సీన్స్​ని రీక్రియేట్ చేశారు. అమల అక్కినేని రవి, రోజాతో కలిసి డాన్స్​ చేయడమే కాకుండా, జంతు సంరక్షణ, నాగార్జున, నాగచైతన్య, అఖిల్​ గురించి పలు విషయాలు పంచుకున్నారు. జయసుధకు అభిమానులు ఆటోగ్రాఫ్‌లతో అలంకరించిన చీరను బహుమతిగా ఇచ్చారు. రమ్యకృష్ణ నటించిన ప్రముఖ పాత్రలతో ఓ చక్కని ప్రదర్శన ఇచ్చారు. మంచు లక్ష్మీ తన డాన్స్​తో అలరించగా, కోర్ట్​ సినిమా ఫేమ్​ శ్రీదేవి తన తల్లి గురించి పంచుకున్న విషయాలు అందరినీ కంటతడి పెట్టించాయి. రవి, సుధీర్ కలిసి డైరెక్టర్​ సుకుమార్‌ను పలు సరదా ప్రశ్నలతో ఆటపట్టించారు.

 

  • వెండితెర, బుల్లితెర తారల సందడితో వైభవంగా జరిగిన జీ తెలుగు అప్సర అవార్డ్స్​ ఈ శనివారం, మే 24, 2025 సాయంత్రం 5:30 గంటలకు మీ జీ తెలుగులో ప్రసారం కానుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news