జీరో టైం టేబుల్ అమలు.. రైల్వే ప్రయాణికులకు ఇబ్బందులు ?

-

భారతీయ రైల్వేస్ ప్రయాణికలు హెచ్చరిక లాంటి నిర్ణయాన్నితీసుకుంది. కరోనా కారణంగా నిలిచిన రైల్వే వ్యవస్థలో కొన్ని రైళ్లు రద్దు చేసింది. దీంతో ఇండియన్ రైల్వేస్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం రైళ్లు ఆగుతున్న సంఖ్యను తగ్గించి, పలు రైళ్లను రద్దు చేయాలని నిర్ణయించింది.

Train Passengers
Train Passengers

లాక్ డౌన్ కారణంగా ప్రసుత్తం రైల్వేలు నడవడం లేదని అందరికి తెలుసు. అయితే రైల్వేలు నడిపిన తర్వాత మీరూ తెలుసుకోవాల్సిన విషయాలు. ట్రైన్ జర్నీ చేయాలనుకునే వారికి టైమింగ్ చాలా ప్రాముఖ్యం. అయితే ఇప్పడు ఇండియన్ రైల్వేస్ ట్రైన్ టైమింగ్స్ కి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. జీరో బేస్ట్ టైమ్ టేబుల్ ను తీసుకురావాలని భావిస్తోంది.

ప్రతి ఏడాది ఇండియన్ రైల్వేస్ కొత్త టేమ్ టేబుల్ ను అమలు చేస్తుందని అందరికి తెలిసిన విషయమే. అయితే సాధారణంగా రైల్వే టైమ్ టేబుల్ జూలై నుంచి వచ్చే ఏడాది జూన్ వరకు వర్తించాల్సి ఉండగా.. కొత్త టైం టేబుల్ ను అమలు చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా క్లిష్ట పరిస్థితిలో కొత్త టైమ్ టేబుల్ ను ఎప్పుడు అమలు చేస్తారో తెలియని పరిస్థితి. గత కొన్ని దశాబ్దాలుగా రైల్వే వ్యవస్థలో స్టేషన్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. చాలా రైళ్లు పూర్థి సామర్థ్యంతో నడవడం లేదు. సగానికన్నా తక్కువ సామర్థ్యంతో నడిచే రైళ్లను రద్దు చేయాలని ఇండియన్ రైల్వేస్ భావిస్తోంది. దీంతో రైళ్ల రాకపోకలల్లో సమయం కొంత మేర తగ్గొచ్చని, ప్రయాణం వేగవంతం అవ్వొచ్చని భావిస్తోంది.

సామర్థ్యం తక్కువగా ఉన్న దాదాపు 100 రైళ్లను రద్దు చేయాలని ఇండియన్ రైల్వేస్ భావిస్తోందని విశ్వసనీయ సమాచారం. ట్రైన్ల రద్దుతో భారీ సంఖ్యలో ప్రయాణించే ప్రయాణికులపై తీవ్ర ప్రభావం పడనుంది. సామర్థ్యం తగ్గిన రైల్వేలతో సహా ప్రస్తుతం ఉన్న నడుస్తున్న కొన్ని రైల్వే స్టేషన్ ను తొలగించాలని ప్రయత్నిస్తోంది. లాభం తక్కువగా ఉన్న స్టేషన్లు, తక్కువ టికెట్లు అమ్ముడయ్యే రైల్వే స్టేషన్లను తీసేస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news