ఏపీలో జగన్ సర్కార్ నిర్ణయం తీసుకోవడం ఆలస్యం.. అది కాస్తా సంచనలమై కూర్చుంటున్న పరిస్థితులు నేడు నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించిన జగన్ దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నా కూడా తనపని తాను చేసుకుంటూ పోతున్నారు. ఇందులో భాగంగా తాజాగా అమరావతిలోని ప్రభుత్వ భూములును అమ్మే సంచనల నిర్ణయం తీసుకున్నారు!
ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ఉందని ఇప్పటికే పలుమార్లు మాటల్లోనూ చేతల్లోనూ చెప్పిన జగన్.. తాజాగా అమరావతి ప్రాంతంలోని ప్రభుత్వ భూములని అమ్మకానికి పెట్టారు. రాష్ట్రంలో చేపట్టబోతున్న అభివృద్ధి పథకాలు, మరొకొన్ని ప్రాజెక్టుల కోసం అవసరమైన నిధులను సమీకరించుకునే పనిలో భాగంగా… అమరావతి ప్రాంత పరిధిలోని 1600 ఎకరాల భూమిని విక్రయించాలని.. అలా విక్రయించడం ద్వారా వచ్చిన నిధులు “మిషన్ బిల్డ్ ఏపీ”కి బదలాయిస్తారని చెబుతున్నారు.
గత ప్రభుత్వం రకరకాల దేశాల పేర్లు చెప్పి ఆఖరిని సింగపూర్ కి రాజధాని నిర్మాణాన్ని అప్పగిస్తామని చెప్పి… నేడు అమరావతిని ఈ పరిస్థితికి తెచ్చిందనే సంగతి తెలిసిందే. మూడురాజధానుల బిల్లుతో పాటు జగన్ ప్రభుత్వం ప్రతిపాదించిన సీఆర్డీఏ రద్దు బిల్లును రద్దు చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో… సింగపూర్ కన్సార్టియం అమరావతి ప్రాజెక్టు నుంచి వైదొలగింది. దీనితో సింగపూర్ కన్సార్టియానికి కేటాయించిన భూములు రాష్ట్ర ప్రభుత్వం చేతికి రావడంతో.. వాటిని విక్రయించాలని తాజాగా ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.
ఆ విధంగా మూడు రాజధానుల విషయంలో జగన్ సర్కార్ తనపని తాను చేసుకుంటూపోతూనే… బాబుకు దిమ్మతిరిగే నిర్ణయాలు తీసుకుంటుంది!