పులికి కల్నల్ సంతోష్ బాబు పేరు !

-

రాయల్ బెంగాల్ జాతికి చెందిన ఒక పులిపిల్లకి నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గాల్వాన్ లోయలో దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్ బాబు పేరు పెట్టారు. అలా హైదరాబాద్ జూలో పుట్టిన ఆ పులిపిల్లకు అరుదైన గౌరవం దక్కిందని చెప్పచ్చు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ లో రాయల్ బెంగాల్ టైగర్ ఆశ మూడు పిల్లలకు జన్మనిచ్చింది.

దివంగత ఆర్మీ కల్నల్ బీహార్ 16వ రెజిమెంట్ కి కమాండింగ్ ఆఫీసర్ గా ఉన్నారు. LACలో చోటు చేసుకున్న ఘర్షణలలో మరణించిన 20 మందిలో 12 మంది 16 బీహార్ రెజిమెంట్ కు చెందిన వారే ఉన్నారు. ఇక లాక్ డౌన్ సమయంలో ఆశ జన్మనిచ్చిన పిల్లల్లో ఒక పులికి కల్నల్ సంతోష్ బాబు పేరిట సంతోష్ గా నామకరణం చేయగా మిగిలిన రెండు పిల్లలకు సూర్య, సంకల్ప్ అనే పేర్లు పెట్టారు. ప్రస్తుతానికి మొత్తం మూడు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్టు జూ అధికారులు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version