హాస్పిటల్ బెడ్ పై జుకర్ బర్గ్.. ఇన్ స్టా పోస్ట్ వైరల్

-

మెటా చీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్ బర్గ్ మోకాలికి గాయం కావడంతో ఇటీవలే ఆపరేషన్ చేయించుకున్నాడు. మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సమయంలో మోకాలికి తీవ్ర గాయం కావడంతో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం అతని ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. మార్క్ జుకర్ బర్గ్ పోస్ట్ ప్రకారం.. ఏఎల్సీ (Anterior cruciate Ligament) తొలగించి రీప్లేస్ చేయించుకోవడానికి ఆపరేషన్ చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది తనను జాగ్రత్తగా చూసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపాడు.

వచ్చే ఏడాది మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ పోటీలో పాల్గొనడానికి ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపాడు. దీంతో శిక్షణకు కొద్ది రోజులు దూరంగా ఉండాల్సి వస్తుందని.. కోలుకున్న తరువాత మళ్లీ శిక్షణ ప్రారంభిస్తానని జుకర్ బర్గ్ వెల్లడించారు. నాపై ప్రేమ చూపిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ ఇన్ స్టా గ్రామ్ పోస్టు చేశాడు జుకర్ బర్గ్.

Read more RELATED
Recommended to you

Latest news