సుప్రీమ్ కోర్ట్ తో 12-18 ఏళ్ళ వాళ్లకి త్వరలో Zydus Cadila Shot ఇస్తామన్న కేంద్రం..!

-

Zydus Cadila Shot : కరోనా మహమ్మారి కారణంగా మనం ఎన్నో సమస్యలతో సతమతం అయ్యాము. ఒక పక్క వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ Zydus Cadila అభివృద్ధి చేసిన కొత్త కరోనా వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానుంది.

12 ఏళ్ల నుండి 18 ఏళ్ల వయసు వాళ్ళు ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వం శనివారం నాడు సుప్రీం కోర్టులో చెప్పింది. సుప్రీం కోర్ట్ దీనికి సంబంధించిన ప్రశ్నలు కూడా అడిగింది. అదే విధంగా దేశంలో ఉండే పెద్దవాళ్ళకి ఈ సంవత్సరం నాటికి వ్యాక్సిన్ పూర్తి చేస్తామని చెప్పింది.

18 ఏళ్లు దాటిన వాళ్లకి 18.6 కోట్లు డోసులు అవసరమని చెప్పింది. అలానే వ్యాక్సిన్ వేయించుకోవడానికి డిజిటల్ గా పేరు నమోదు చేసుకునే అవసరం లేదని డైరెక్ట్ గా వ్యాక్సిన్ సెంటర్లకు వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవచ్చని కూడా చెప్పింది.

ఇప్పుడు 18 ఏళ్లు దాటిన వాళ్లకి కొత్త ప్రైవసీ పాలసీ కింద ఫ్రీగా వ్యాక్సిన్ పొందొచ్చని వెల్లడించారు. ఇది ఇలా ఉంటే కేంద్రం ఫేక్ వ్యాక్సిన్ క్యాంప్ మీద స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటామని కూడా అంది. అయితే ఇప్పుడు ప్రైవేటు వాక్సినేషన్ సెంటర్లలో కొత్త స్కీమ్ కూడా ఉంది. ఎన్జీవోలు వ్యాక్సిన్ వోచర్లు కొనిస్తే ఆర్థికంగా బలహీనంగా ఉండే వాళ్లకి వాటిని అందించవచ్చు అని చెప్పింది.

ఇది ఇలా ఉంటే ఇప్పుడు అందరినీ డెల్టా ప్లస్ వేరియంట్ భయపెడుతోంది. కరోనా వైరస్ రెండో వేవ్ అయిపొయింది అనుకుంటే ఇప్పుడు మూడో వేవ్ కూడా వస్తుందేమో అని భయం అందరిలో వుంది. కరోనా కొత్త వేరియంట్ కేసులు కూడా భారతదేశంలో నమోదవుతున్నాయి. అయితే ఇంకా సగం మంది జనాభా కూడా వ్యాక్సిన్ వేయించుకోలేదు.

ఇప్పటికే వ్యాక్సిన్ లో కొరత.. అదే విధంగా పల్లెటూర్లలో వ్యాక్సిన్ అందుబాటులో లేక ఇబ్బందులు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 21 నుండి 18 ఏళ్లు దాటిన వాళ్లకి ఫ్రీ గా వ్యాక్సిన్ వేస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version