అశ్వవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతున్న స్వామివారు….

-

కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజైన బుధవారం రాత్రి  అశ్వవాహనంపై తిరుమాడ వీధుల్లో స్వామివారు విహరించారు. స్వామి భక్తులకు భౌతికమైన జ్ఞానేంద్రియాలను కట్టుదిట్టం చేసి దివ్యమైన జ్ఞానం ప్రసాదిస్తాడని అఖండకోటి భక్తుల నమ్మకం. ఈ అవతారంలో అశ్వవాహనరూఢుడై దుష్టజన సంహారం, శిష్టజన సంరక్షణ చేసి ధర్మాన్ని స్థాపిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఉత్సవంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జస్టిస్‌ ఇందు మల్హోత్రా, తితిదే ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌,  మంత్రి కొల్లు రవీంద్ర పలువురు ప్రముఖులు, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news