ఇందూరు సాక్షిగా కాంగ్రెస్ – తెదేపాపై కేసీఆర్ ధ్వజం

-

ప్రభుత్వాన్ని రద్దు చేయంగానే ఇప్పుడు గిలగిలా కొట్టుకుంటున్నారు

తెరాస అధినేత కేసీఆర్ నిజామాబాద్ వేదికగా కాంగ్రెస్- తెదేపా పై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూకాంగ్రెస్ పార్టీ నేతల బతుకులే కేసులు. ఊ అంటే కేసు, ఉ.. పోసినా కేసులంటూ ధ్వజమెత్తారు.  రైతుబంధు పథకం కింద నవంబర్ నెలలో యాసంగి పంటకు ఎకరానికి రూ.4 వేల చొప్పున ఇస్తామని చెప్పాం.. దీనిపై కాంగ్రెస్ పార్టీవాళ్లు కోర్టులో కేసు వేయడంపై తనదైన శైలిలో కేసీఆర్ బదులిచ్చారు. ముఖ్యంగా చంద్రబాబు, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిలను టార్గెట్‌గా చేసుకుని..తన పదునైన మాటల తూటాలను సంధించారు. . రోజూ ప్రతిపక్షాల  సొల్లు పురాణం చెబుతుంటే నాకు తిక్కరేగి ప్రభుత్వాన్ని రద్దు చేస్తా, ఎన్నికలకు పోదామా? ప్రజల వద్దకు వెళ్దామా అని సవాలు చేశా. ప్రభుత్వాన్ని రద్దు చేయంగానే ఇప్పుడు గిలగిలా కొట్టుకుంటున్నారు.

సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్ వద్దకు పోయి అడ్డుకుంటున్నారు. ఎన్నికలకు పోదామా? అని ప్రశ్నించిన వారే.. ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆగమాగం అవుతున్నారు. చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. పదవులంటే ఎడమకాలి చెప్పులా వదిలేస్తాం. తెలంగాణ.. దేశంలోనే నెంబర్ వన్: ‘‘కడుపు, నోరు కట్టుకొని అవినీతికి దూరంగా ఉండి పని చేసిన కారణంగా రాష్ట్ర ఆదాయం దేశంలోనే నెంబర్ వన్‌గా ఉంది. నాలుగేళ్లలో 17.17 శాతం ఆర్థిక ప్రగతి ఉంది. చంద్రబాబు ఏపీ రక్షసుడు అలాంటి, తెలంగాణ ద్రోహి అలాంటి వ్యక్తితో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news