పులిచింతల ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ కి సరైన సమయంలో బకాయిలు చెల్లించనందుకు మచిలీపట్నం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఏపీ ఇరిగేషన్ శాఖ కు చెందిన భూమిని వేలం వేసి ఆయన బకాయి తీర్చాలని ఆదేశించింది. ఇందులో భాగంగా విజయవాడలో ని స్వరాజ్య మైదానాన్ని వేలం వేయాలని సూచించింది. 2016 నాటికి తనకు రావాల్సిన రూ.127 కోట్లకు గాను వడ్డీతో సహా కలిపి రూ. 407 కోట్లను ఇప్పించాల్సిందిగా 2017లో కోర్టుని వేడుకున్నారు. వాస్తవాలను పరిశీలించిన మచిలీపట్నం కోర్టు ఇరిగేషన్ శాఖకు చెందిన ఆస్తులను అమ్మి చెల్లించాలని పేర్కొంది.