అల్లు అర్జున్ వేరు కుంపటి..!

-

బయట ప్రొడక్షన్స్ ఏమో కాని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా అంటే ముందు గీతా ఆర్ట్స్ రెడీ అయి కూర్చుంటుంది. అల్లు అరవింద్, బన్ని వాసు ఇద్దరు బన్ని సినిమా కోసం భారీ ప్లాన్లు వేస్తుంటారు. ఇక అల్లు అర్జున్ సినిమా కథా చర్చలు కూడా గీతా ఆర్ట్స్ ఆఫీస్ లోనే జరుగుతాయి. నా పేరు సూర్య ఫలితం చూశాక తన స్క్రిప్ట్ విషయంలో ఎవరిని వేలు పెట్టనివ్వకూడదని డిసైడ్ అయ్యాడట.

ముఖ్యంగా గీతా ఆర్ట్స్ లో ఉన్న వారిని తప్పించుకునేలా అల్లు అర్జున్ సెపరేట్ ఆఫీస్ ఓపెన్ చేశాడు. బన్ని ఇక నుండి కథా చర్చలు అక్కడే డిస్కస్ చేస్తాడట. నా పేరు సూర్య తర్వాత బన్ని ఎవరితోనూ సినిమా కన్ఫాం చేయలేదు. విక్రం కుమార్ సినిమా ఉంటుందని చెబుతున్నా కథ ఫైనల్ అయినా నరేషన్ విషయంలో రాజీ కుదరడం లేదట.

అందుకే బన్ని సొంత ఆఫీస్ పెట్టేసి మనసుకి నచ్చే కథలను ఓకే చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నాడట. లింగుసామితో తెలుగు, తమిళ భాషల్లో సినిమా చేయాల్సి ఉన్నా అది వెనక్కి వెళ్లింది. ప్రస్తుతం బన్ని చూపంతా త్రివిక్రం మీద ఉంది. అరవింద సమేత పూర్తి కాగానే బన్నితోనే సినిమా చేస్తాడని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news