ఘనంగా పరమహంస యోగానంద జయంతి ఉత్సవాలు

-


హైదరాబాద్ బేగంపేటలోని వైఎస్ఎస్ ధ్యాన కేంద్రంలో పరమహంస యోగానంద 130వ జయంతి వేడుకలు ఆవిర్భావ దినోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పరమహంస యోగానంద రచించిన గాడ్ టాక్స్ విత్ అర్జున, ఒక యోగి ఆత్మకథ తదితర పుస్తకాలపై 25% డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నారు.ప్రతి సంవత్సరం జనవరి 5న తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో  ఆయన జయంతి వేడుకలు జరుపుకొంటారు. యోగానంద దాదాపు 30 ఏళ్ళకు పైగా సనాతన భారతదేశపు ఆధ్యాత్మిక బోధనలను అందించడానికి అమెరికాలో ఉండిపోయారు.

యోగానంద జీవితంలో, ఆయన వ్యక్తిత్వంలో ప్రతిఫలించిన స్వచ్ఛమైన ప్రేమ, శాంతి, మరియు ఆనందంతో ప్రభావితులైన అనేక మంది అనంతాన్ని చేరుకోవడానికి ఆయన చూపించిన మార్గాన్ని అనుసరిస్తున్నారు.యోగానంద శిష్యులైన వారిలో అమెలిటా గల్లి-కుర్చి ,లూథర్ బర్బాంక్ వంటి ప్రముఖ వ్యక్తులు ఉండగా, గురుదేవుల దేహత్యాగం తరువాత ఆయన బోధలకు గాఢంగా ప్రభావితులైన వారిలో ఎందరికో ఆరాధ్యులైన పండిత రవిశంకర్,స్టీవ్ జాబ్స్ ,జార్జ్ హారిసన్ వంటి వారున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news