జైళ్ల శాఖ ఉత్పత్తుల అమ్మకానికి డీలర్ షిప్ ఆహ్వానం

-

మైనేషన్ పేరుతో వివిధ వస్తువులను రాష్ట్ర జైళ్ల శాఖ శిక్ష అనుభవిస్తున్న ఖైదీలచేత తయారు చేయిస్తుంది. వీటికి నగరంలో విపరీతమైన డిమాండ్  ఉన్న సంగతి తెలిసిందే. జైళ్ల శాఖ అధాయ వనరులను పెంచుకోవడంలో భాగంగా ప్రతీ మండలంలో రెండు స్టాల్స్ ని డీలర్ షిప్ ఇచ్చుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. బెడ్ షీట్స్, టవల్స్, ఫ్లోర్ క్లీనర్, ఫినాయిల్, క్యాండిల్, హ్యాండ్ వాష్, హౌస్ ఫర్నీచర్, స్కూల్ ఫర్నీచర్,బీరువాలు తదితర ఉత్పత్తులను తయారు చేసి మైనేషన్ బ్రాండ్ పేరు మీద జైళ్ల శాఖ అమ్మకాలు సాగిస్తుంది.

డీలర్ షిప్ తీసుకునే వారికి 10 శాతం మార్జిన్ కమిషన్ గా ఇస్తారు. క్రెడిట్ తీసుకుని అమ్మిన తర్వాతే 10 శాతం డీలర్ కమీషన్ తీసుకుని మిగిలిన 90 శాతం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి గల వారు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోటో తీసుకుని జైలు, సబ్ జైలులో దరఖాస్తు నమోదు చేసుకోవాలని జైళ్ల శాఖ సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news