దేవదాస్ వారంలో ఎంత తెచ్చిందంటే..!

-

కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీ దేవదాస్ సెప్టెంబర్ 27న గురువారం రిలీజ్ మంచి టాక్ సొంతం చేసుకుంది. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను అశ్వనిదత్ నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 37 కోట్లు చేయగా వారంలో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 21.30 కోట్లను వసూళు చేసింది. దేవ.. దాస్ లుగా నాగ్, నాని ఇద్దరు తమ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు.

అయితే కథ, కథనాలు రొటీన్ గా ఉండటం వల్ల ఆడియెస్ దీన్ని యావరేజ్ మూవీ చేశారు. అయితే బ్రేక్ ఈవెన్ రావాలంటే మరో 16 కోట్లు దాకా కలెక్ట్ చేయాల్సి ఉంది. రేపు నోటా వస్తుండగా మరో వారంలో ఎన్.టి.ఆర్ అరవింద సమేత వస్తుంది. ఈ రెండు సినిమాల తాకిడికి దేవదాస్ ఏమాత్రం నిలబడతాడో చూడాలి.

నాగ్, నానిల క్రేజీ మల్టీస్టారర్ గా వచ్చిన ఈ దేవదాస్ సినిమాను శ్రీరాం ఆదిత్య రొటీన్ పంథాలో సాగించడం మైనస్ అయ్యింది. సినిమాకు ఇద్దరు హీరోల రెమ్యునరేషన్ వల్ల బడ్జెట్ కూడా పెరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news