స్పీకర్‌ కోడెలకు కోర్టు నోటీసులు

-

  • 10న హాజరుకావాలంటూ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు

High Court Shock to AP Speaker Kodela Siva Prasad

హైదరాబాద్‌: ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించి అధికంగా ఖర్చు చేశారన్న కేసులో ఆంధ్రప్రదేశ్‌ శాసన సభాపతి కోడెల శివప్రసాదరావుకు ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈనెల 10న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కోడెల 2014 ఎన్నికల్లో నిబంధనలకు మించి ఖర్చు చేశారంటూ సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి గతంలో కరీంనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తాను ఎన్నికల్లో సుమారు పదకొండున్నర కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు… ఓ ఇంటర్వ్యూలో స్వయంగా కోడెల చెప్పినందున విచారణ జరిపించాలని పిటిషనర్ కోర్టును కోరారు. దీన్ని విచారణకు స్వీకరించిన కరీంనగర్ కోర్టు విచారణకు హాజరుకావాలని కోడెలను గతంలో ఆదేశించింది. అయితే కరీంనగర్ కోర్టు ఆదేశాలపై కోడెల శివప్రసాద్ హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు. మరోవైపు ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసుల విచారణకు నాంపల్లిలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు కావడంతో ఆ కేసు అక్కడికి బదిలీ అయింది. కోడెల స్టే పొంది ఆరు నెలలు పూర్తి కావడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టే పొడిగించాలని హైకోర్టును కోరారు. హైకోర్టులో పిటిషన్ ఇంకా విచారణకు రాలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రత్యేక కోర్టు ఈ నెల 10న విచారణకు రావాలని కోడెలను ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news