పశు పోషకులకు శుభవార్త.. ఇకపై వాటికి రాయితిని ఇవ్వనున్న ప్రభుత్వం

-

రాష్ట్రవ్యాప్తంగా పశు పోషకులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్థక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల షెల్టర్ల నిర్మాణానికి రాయితీ పథకాన్ని అర్హులందరికీ అమలు చేయనున్నట్లు మంత్రి అచ్చెన్న తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పశు పోషకులకు 90శాతం రాయితీపై ఒక్కో షెడ్డుకు గరిష్ఠంగా రూ.2.30లక్షలు, గొర్రెలు, మేకల షెడ్లకు 70శాతం రాయితీపై గరిష్ఠంగా యూనిట్‌కు రూ.2.30లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

అంతేకాకుండా కోళ్ల పెంపకందారుల కోసం ఒక్కో షెడ్డు నిర్మాణానికి 70శాతం రాయితీపై గరిష్ఠంగా యూనిట్‌కు రూ.1.32లక్షలు ఇస్తామని,త్వరలో అన్నీ జిల్లాల్లో ఈ పథకం అమలు కానున్నట్లు తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఏపీ పశుసంవర్థక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పశువుల పెంపకందారులను మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news