ముంబై జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ‘శుభ్ ఆశీర్వాద్’ వేడుకకు సినీ సెలబ్రిటీస్ తరలివస్తున్నారు. అమితాబ్ బచ్చన్,షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, సునీల్ శెట్టి, ఐశ్వర్యరాయ్,మాధురీ దీక్షిత్, అలియా భట్, దిశా పటానీ, కరణ్ జోహార్ హాజరయ్యారు. విక్టరీ వెంకటేశ్, రష్మిక మందాన, కాజల్ అగర్వాల్, తమిళ డైరెక్టర్ డైరెక్టర్ అట్లి తదితరులు వేడుకలో సందడి చేశారు.
అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రామ్ చరణ్-ఉపాసన ఒకే ఫ్రేమ్ లో తారసపడ్డారు. వీరితో పాటు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇవాళ రాత్రికి వారు ముంబైలోనే బస చేయనున్నారు.