పుట్టిన గడ్డని మరవొద్దు…చంద్రబాబు

-

అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ సీఎం  చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం (భారత కాలమాలనం ప్రకారం సోమవారం తెల్లవారు జాము) న్యూయార్క్ లో ఎన్ఆర్ఐలు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పుట్టిన గడ్డని ఎప్పటికి మరవొద్దన్నారు. తెదేపా జెండా ఇతర దేశాల్లో రేపరేపలాడుతుందని ఎన్నడూ ఊహించలేదన్నారు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని ఏవిధంగా అయితే అభివృద్ధి చేశానో అంతకంటే రెట్టింపైన ఉత్సాహంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టండి మీకు నేను అండగా ఉంటా అంటూ వారిని కోరారు. ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో ఉండే ఏకైక కమ్యూనిటీ తెలుగు కమ్యూనిటీ అన్నారు.

విదేశాల్లో ఉన్న ప్రతీ ఒక్కరు మీ స్వగ్రామంతో టచ్ లో ఉండాలని సూచించారు. నాపై నమ్మకంతో 2014 ఎన్నికల్లో నన్ను గెలిపించారు. మీ నమ్మకాన్ని వొమ్ము చేయకుండా ఆత్మవిశ్వాసంతో పనిచేస్తున్నా… ఈ సారి తెదేపా గెలుపు చారిత్రక అవసరం అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.  హైటెక్ సిటీని ప్రారంభించి నేటికి 20 ఏళ్లు గడిచిందన్నారు. భవిష్యత్ ఆలోచించి నాడు ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయడం వల్లనే నేడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు సాఫ్ట్ వేర్ రంగంలో రాణిస్తున్నారని తెలిపారు. ఈ బహిరంగ సభకు న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాల్లోని నాలుగు వేల మంది ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news