బీఆర్‌ఎస్‌ను బొంద పెట్టే మొనగాడు పుట్టలేదు : కడియం శ్రీహరి

-

దావొస్ పర్యటన ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా లండన్ కు వెళ్లారు . ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే‌ కడియం శ్రీహరి ఫైర్‌ అయ్యారు. విదేశాల్లో బీఆర్‌ఎస్‌పై అనుచితంగా మాట్లాడిన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ పరువు తీశారని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ను వంద అడుగుల లోతులో బొందపెడుతామన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.

బీఆర్‌ఎస్‌ను బొంద పెట్టే మొనగాడు ఇంకా పుట్టలేదన్నారు కడియం శ్రీహరి. గతంలో దావోస్‌ పర్యటనకు వెళ్లిన కేటీఆర్‌ ఎంతో హుందాగా ప్రవర్తించారు. పెట్టుబడులు సాధించడంలో కేటీఆర్ క్రియాశీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. దేశంలోనే రోల్ మోడల్ గా తెలంగాణాను తీర్చిదిద్దినది టిఆర్ఎస్ హయాంలోనే అని అన్నారు. అలాంటి కేసీఆర్‌ని తూలనాడడం సరి కాదన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్‌ఎస్‌ గెలుపు సాధిస్తుందని ధీమ వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news