మావోయిస్టులు జరిపినకాల్పుల్లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతి చెందారు. ఎమ్మెల్యేతోపాటు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కూడా ఇదే కాల్పుల్లో మృతి చెందారు. విశాఖ మన్యంలోని డుంబ్రిగుడ మండలం పొత్తంగి రహదారిపై ఘటన చోటుచేసుకుంది. సుమారు 50 మంది పైగా మావోయిస్టులు ఈ ఘటనలో పాల్గొన్నట్లు ప్రాథమిక సమాచారం. ఎమ్మెల్యేని కాల్చి చంపడంతో విశాఖ మన్యం ఉలిక్కిపడింది. మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ నేతృత్వంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అరకు నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కిడారి సర్వేశ్వరరావు ఏడాది క్రితమే తెలుగుదేశంపార్టీలో చేరారు. ఇటీవలే దేశం ప్రభుత్వం ఆయనను ప్రభుత్వ విప్ గా నియమించింది. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సర్వేశ్వరరావు ఎమ్మెల్సీగా చేశారు. ఇటీవల కాలంలో బాక్సైట్ కనుకూలంగా సర్వేశ్వరరావు వ్యవహరిస్తున్నారని నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.
మావోయిస్టుల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే కిడారి మృతి
-