ప్రపంచ రక్షణ సమాచారాన్ని ట్రాక్ చేసే వెబ్‌సైట్ గ్లోబల్ ఫైర్‌పవర్ 2024కి గానూ 145 దేశాల ర్యాంకుల్ని వెల్లడించింది.అయితే అత్యంత శక్తి వంతమైన మిలిటరీ కలిగి ఉన్న దేశంగా తొలిస్థానంలో అమెరికా నిలువగా లాస్ట్ లో భూటాన్ నిలిచింది . రష్యా సెకండ్ ప్లేస్ లో, చైనా థర్డ్ ప్లేస్ లో ఉన్నాయి.ఇండియా 4వ స్థానంలో నిలిచింది. ఇజ్రాయిల్ 17 స్థానంలో ఉంది. సైనికుల సంఖ్య, సైనిక పరికరాలు,భౌగోళిక స్థానం, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలతో పాటు 60 కంటే ఎక్కువ అంశాలను పరిగణనలోకి తీసుకొని పవర్ ఇండెక్స్ స్కోర్‌ని నిర్ణయించారు.
డిఫెన్స్ బడ్జెట్ పరంగా చూస్తే అమెరికా ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. చైనా సెకండ్ ప్లేస్ లో, రష్యా థర్డ్ ప్లేస్ లో, భారత్ ఫోర్త్ ప్లేస్ లో ఉంది. బడ్జెట్ పరంగా బంగ్లాదేశ్ 43వ స్థానంలో ,పాకిస్తాన్ 47వ స్థానంలో ఉంది.
ప్రపంచంలో అత్యంత శక్తి వంతమైన సైనిక శక్తి ఉన్న టాప్-10 దేశాలు:
1) అమెరికా
2) రష్యా
3) చైనా
4) ఇండియా
5) దక్షిణ కొరియా
6) యునైటెడ్ కింగ్‌డమ్
7) జపాన్
8) టర్కీయే
9) పాకిస్తాన్