ఈ రాశివారు నారాయణసేవ చేస్తే…! జనవరి 8 మంగళవారం- రోజువారి రాశిఫలాలు

-

మేషరాశి: సానుకూలమైనరోజు, ఆదాయం, వస్తులాభం, వాహనం వల్ల ఇబ్బందులు. చేపట్టిన పనులు పూర్తి. మంచి ఫలితం కోసం ఇష్టదేవతారాధన చేసుకోండి.

వృషభరాశి: ప్రతికూలమైన రోజు, ఆర్థిక ఒడిదుడుకులు, దేవతాకార్యాలలో పాల్గొంటారు. నారాయణ సేవ చేయండి మంచి ఫలితం ఉంటుంది.

మిధునరాశి: సోదరసోదరీలు మీ ఇంటికి రాక, పెద్దలతో వైరం, అనవసరమైన ఖర్చు, స్థానచలనం. మంచి ఫలితాల కోసం వివాదాలకు దూరంగా ఉండి శివాభిషేకం లేదా శివాలయ సందర్శన చేయండి.

కర్కాటకరాశి: శుభమూలక ధనలాభం, మిత్రులవల్ల లాభం, సుఖం, మనస్సు మాత్రం బాగుండదు. పరిహారం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి.

సింహరాశి: సంతానంతో ఇబ్బందులు, కొత్త పనులు ప్రారంభించవద్దు, కొత్త వ్యక్తులతో, పెద్దవారితో పరిచయం. సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయండి మంచి జరుగుతుంది.

కన్యారాశి: ప్రతికూలమైన గ్రహసంచారం. వివాదాలకు, మాటపట్టింపులకు దూరంగా ఉండండి. అనవసర తిరుగుడు, ఖర్చు. నూతన పరిచయాలు. మంచి ఫలితం కోసం ఈశ్వర ఆరాధన, పేదలకు సహాయం చేయండి.

తులారాశి: ప్రయాణ ఇబ్బందులు, విందు భోజనం, అనవసర ఖర్చులు, రక్తసంబంధీకులతో వివాదాలకు ఆస్కారం. పరిహారం నరసింహస్వామి ఆరాధన లేదా ఆంజనేయస్వామి సింధూరం ధరించండి మంచి జరుగుతుంది.

వృశ్చికరాశి: అహ్లాదకర వాతారణం, బాకీలు వసూలు, పనులు జరిగిపోతాయి. పెద్ద ఇబ్బందులు ఉండవు. ఇష్టదేవతారాధన చేసుకోండి సరిపోతుంది.

ధనస్సురాశి: నూతన వ్యవహార చర్చలు, అధిక శ్రమ, ఖర్చు, చిన్నచిన్న నష్టాలు, వివాదాలకు ఆస్కారం. ప్రశాంతత కోసం విష్ణు/వేంకటేశ్వర ఆరాధన లేదా దేవాలయ సందర్శన చేయండి.

మకరరాశి: కళత్ర లాభం, స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు, అనుకోని సంఘటనలతో ధనలాభం రావచ్చు. మంచి ఫలితాల కోసం అమ్మవారి ఆరాధన చేయండి.

కుంభరాశి: సంతోషకరమైన రోజు, అనందం, ఉత్సాహంగా గడుపుతారు, దేవాలయ సందర్శన సూచన, చేపట్టిన పనులు ప్రారంభం. ఆంజనేయస్వామి దేవాలయ ప్రదక్షిణలు చేయండి. బీదలకు సహాయం చేయండి.

మీనరాశి: మంచి రోజు, చేపట్టిన పనులు పూర్తి, కొత్త పనులు ప్రారంభానికి అవకాశం, బంధువులు, మిత్రుల కలయిక/రాక. మంచి ఫలితాల కోసం సూర్యోదయాన్నే తులసీ చెట్టువద్ద దీపం పెట్టి సూర్యనమస్కారం చేసుకోండి మంచి జరుగుతుంది.

నోట్: నారాయణ సేవ అంటే రోడ్డుపక్కన లేదా దేవాలయాల వద్ద కదలలేని స్థితిలో, కడుదయనీయ స్థితిలో ఉన్నవారికి మీ ఇంట్లో వండుకున్న అన్నం, పప్పు, కూర, పచ్చడి ఏదైనా మంచి పదార్థాలు మీరు తినేవి అంటే పాడుకానివి అప్పుడు వండినవి చక్కగా ప్యాక్ చేసి ఒక బాటిల్ నీటితో సహా వారికి అందించండి. తప్పక మీకు మంచి ఫలితం ఉంటుంది. ఈ పనిని వారానికి ఒక్కసారైనా తప్పక చేయండి. అలవాటుగా మార్చుకోండి. మానవ సేవయే మాధవ సేవ. ఇది వీలు కానివారు ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉండేవారు జీహెచ్‌ఎంసీ రూ.5 భోజనాన్ని ఆ చుట్టుపక్కల వారికి ఇప్పించండి.
-కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version