మార్చి 15 శుక్రవారం – రోజువారి రాశిఫలాలు
మేషరాశి: అనుకూలమైన లాభం, వస్తులాభం, ధనలాభం, పనులు పూర్తి.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, గోసేవ మంచి ఫలితాలను ఇస్తుంది.
వృషభరాశి: మిశ్రమం. విరోధాలు, వ్యవహార లాభం, పనులు నెమ్మదిగా సాగుతాయి.
పరిహారాలు: ఎర్రవత్తులతో అమ్మవారికి/దుర్గాదేవికి పూజచేయండి దోషాలు పోతాయి.
మిథునరాశి: అనుకూల ఫలితాలు, భార్యతరపు బంధువుల రాక, వస్త్రలాభం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, గోసేవ చేయండి మంచిది.
కర్కాటకరాశి: ప్రతికూల ఫలితాలు, ధనవ్యయం, పనుల్లో జాప్యం, అధికారుల వల్ల ఇబ్బందులు.
పరిహారాలు: అమ్మవారికి ఎర్రవత్తులులతో దీపారాధన, ఎర్రపూలతో అర్చన చేయండి ఇబ్బందులు తొలిగిపోతాయి.
సింహరాశి: అనుకూల ఫలితాలు, వస్తులాభం, ధనలాభం, పిల్లల వల్ల పేరు వస్తుంది.
పరిహారాలు: అమ్మవారి నామాలు చదవుకోండి. అవకాశం ఉంటే స్త్రీలు ముత్తైదలకు గాజులు, పండ్లు తాంబూలం ఇవ్వండి.
కన్యారాశి: అనుకూల ఫలితాలు, ఆదాయం పెంపుదల, కార్యలాభం, వస్తులాభం.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, దైవనామస్మరణ మంచిది.
తులారాశి: ప్రతికూలం. ధననష్టం, వ్యయం, ఖర్చులు పెరుగుతాయి. పనుల్లో జాప్యం.
పరిహారాలు: అమ్మవారికి ఎర్రవత్తులతో దీపారాధన, ఎర్రపూలతో ఆరాధన చేయండి.
వృశ్చికరాశి: ప్రతికూలమైన ఫలితాలు, వస్తునష్టం, ధననష్టం, పనుల్లో జాప్యం.
పరిహారాలు: అమ్మవారికి ఎర్రవత్తులతో దీపారాధన, చండీదీపారాధన మంచిది.
ధనస్సురాశి: అనుకూల ఫలితాలు, కీర్తి, ధనలాభం, వస్తులాభం. పనులు పూర్తి.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, అమ్మవారికి అర్చన చేయండి.
మకరరాశి: అనుకూలం. కీర్తి, ధనలాభం, పనులు పూర్తి, వస్తువులు కొంటారు.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, దైవనామస్మరణ చేసుకోండి.
కుంభరాశి: చెడు ఫలితాలు. కార్యనష్టం, ధనవ్యయం, అలసట, స్నేహితులతో విరోధాలు.
పరిహారాలు: అమ్మవారి గుడిలో ప్రదక్షణలు, చండీదీపారాధన మేలు చేస్తుంది.
మీనరాశి: ప్రతికూల ఫలితాలు, ధననష్టం, అనారోగ్య సూచన, వస్తునష్టం.
పరిహారాలు: ఎర్రవత్తులతో అమ్మవారికి దీపారాధన, స్త్రీలు ముత్తైదలకు గాజులు, పూలు, పండ్లు తాంబూలం ఇవ్వండి మంచి ఫలితం కలుగుతుంది.
నోట్ – నారాయణ సేవ అంటే పేదలకు కడుపునిండా ప్రేమతో భోజనం పెట్టడం. మీకు వీలైనంత మేరకు ప్రయత్నించండి. లోభత్వం చేయకూడదు. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. చాలా దోషాలకు ఇది అమోఘంగా పనిచేస్తుంది. స్వల్ప ఖర్చుతో మీకు బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుంది. ఐదురూపాయలకు భోజనం పెట్టే కేంద్రాల వద్ద కనీసం 2 లేదా ముగ్గురికి అన్నం పెట్టించండి. మీకు మంచి జరుగుతుంది.
– కేశవ