వైఎస్ వివేకానందరెడ్డిది హత్యే అని పోస్ట్‌మార్టం నివేదిక ద్వారా తేలింది. నివేదిక ఆధారంగా హత్యగా పోలీసులు నిర్ధారించారు. మొదటి నుంచి వివేకానందరెడ్డి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ముందుగా ఆయన గుండెపోటుతో మరణించారని అనుకున్నా.. ఆయన బెడ్‌రూంలో రక్తం మరకలు, బాత్‌రూంలో రక్తం, ఆయన ఒంటిపై ఉన్న గాయాలను చూస్తే ఇది గుండెపోటుతో సంభవించిన మరణం కాదని అర్థమైంది. అందుకే.. పోలీసులు.. ఆయన మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించారు.
పోస్టుమార్టం నివేదికలో ఆయనది మర్డర్‌గా నిర్ధారణ అయింది. ఆయన నుదుటిపై లోతైన రెండు గాయలు, తల వెనుక మరో గాయం అయింది. వివేకానంద రెడ్డి తొడ భాగంలో గాయం, చేతిపై మరో గాయం అయింది. మొత్తం మీద ఆయన శరీరంపై ఏడు పదునైన గాయాలు అయినట్లు పోస్టుమార్టం రిపోర్ట్ తెలిపింది. దీంతో వివేకానందరెడ్డిని ఎవరు చంపి ఉంటారు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.