దేవాలయ దర్శనంతో ఈ రాశివారికి విశేష ఫలితం!

మేషరాశి: మనోసంతోషం, నూతన వస్త్రలాభం, అలంకార భూషణ ప్రాప్తి, పనులు సాగిపోతాయి. మీ దగ్గర్లోని దేవాలయాన్ని సందర్శించండి.
వృషభరాశి: పనుల్లో ఆటంకం, శారీరక శ్రమ, అనవసర విరోధాలు. పరిహారం ఆంజేనేయస్వామి ఆరాధన/హనుమాన్‌చాలీసా పఠనం/శ్రవణం.
మిధునరాశి: అనుకూల వాతావరణం. స్త్రీమూలక లాభాలు, దూర ప్రయాణ అవకాశం. మంచి ఫలితాల కోసం గోసేవ చేయండి వీలుకానివారు బీదలకు వస్త్రదానం చేయండి.
కర్కాటకరాశి: వ్యవహార జయం, నూతన వ్యాపార ప్రయత్నం, బంధుమిత్రుల రాక. పరిహారాలు ఇష్టదేవతారాధన చేయండి.
సింహరాశి: మీ మాటకు విలువ, గౌరవం. పనుల్లో ఆటంకం. మీ పిల్లలకు అనారోగ్య సూచన. పరిహారాలు సూర్యనమస్కారాలు, విష్ణు సహస్రనామ పారాయణం.
కన్యారాశి: వ్యవహార జయం. కొన్నిరోజులుగా వాయిదా పడుతున్న ఒక కార్యంలో సఫలీకృతం. స్వల్ప అనారోగ్యం. పరిహారం గణపతి ఆరాధన చేయండి.
తులారాశి: చేసే వృత్తిలో లాభం, ధననష్టం, కుటుంబంలో ప్రతికూల వాతావరణం. పరిహారాలు దుర్గాదేవి ఆరాధన, చండీదీపాలు పెట్టండి.
వృశ్చికరాశి: కీర్తి లాభం, ప్రశాంతత, మిత్రుల సహకారం, పనులు పూర్తి. మంచి ఫలితాల కోసం ఇష్టదేవతారాధన చేయండి.
ధనస్సురాశి: మీమాటకు గౌరవం. వ్యసనాల వల్ల ధననష్టం. పనుల్లో ఆటంకం. పరిహారాలు నవగ్రహ ప్రదక్షణ, బీదలకు సహాయం చేయండి.
మకరరాశి: విందువినోదాలు, వాహనాల వల్ల ఇబ్బందులు, పనుల్లో ఆటకం. పరిహారాలు ఈశ్వర ఆరాధన, విష్ణుసహస్రనామ పారాయణం చేయండి. ఇబ్బందులు పోతాయి.
కుంభరాశి: ప్రతికూల వాతావరణం. వ్యవహార నష్టం, ఆర్థిక ఇబ్బందులు. పరిహారాలు నల్లటి ఆవులకు దానా పెట్టండి. వికలాంగులకు భోజనం పెట్టించండి కలసి వస్తుంది.
మీనరాశి: అధికశ్రమ, పనుల్లో ఆటంకం, అనారోగ్య సూచన, చిన్నచిన్న సమస్యలు. పరిహారాలు తులసి చెట్టుకు నీళ్లు పోసి నమస్కారం చేయండి. హనుమాన్‌చాలీసాను కనీసం మూడుసార్లు భక్తితో చదవండి. ఇబ్బందులు తొలిగిపోతాయి.
నోట్: నేడు సంక్రాతి పండుగ. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం. మకర సంక్రమణం. ప్రతినెల సంక్రమణం వస్తుంది. ఈసారి మకరరాశిలో వస్తుంది కాబట్టి ఇది మకర సంక్రమణం. ఈ రోజు ప్రతి ఒక్కరు పెద్దలకు తర్పణాలు/వారి పేరుమీద దాన ధర్మాలు ఆచరిస్తే మంచిది. అదేవిధంగా తెల్లవారుఝామున అభ్యంగన స్నానం. స్నానం చేసే నీటిలో రేగిపండ్లు, నల్లనవ్వులు, బియ్యం గింజలు, వేసుకుని వేడినీటితో తలస్నానం చేయండి. అదేవిధంగా నువ్వుల పొంగలి తప్పక తినండి. వీటివల్ల ఆధ్యాత్మింకగానే కాకుండా సైన్స్ పరంగా కూడా లాభాలు చేకురుతాయి.
-కేశవ