ఆవునెయ్యితో దీపారాధన చేస్తే ఈ రాశుల వారికి ధనలాభం! మార్చి 24 రాశి ఫ‌లాలు

మార్చి 24 ఆదివారం- రోజువారి రాశిఫలాలు

మేషరాశి: మంచి ఫలితాలు, వాహన లాభం, కార్యాలు పూర్తి, జయం, ధనలాభం.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, దైవనామస్మరణ చేసుకోండి.

వృషభరాశి: మిశ్రమ ఫలితాలు, స్త్రీలతో కలహం, ధనానికి లోటు ఉండదు, ప్రయాణ సూచన.
పరిహారాలు: ఆవునెయ్యితో దీపారాధన చేయండి. లేదా చండీదీపారాధన చేయండి.

మిథునరాశి: ప్రతికూల ఫలితాలు, అధిక ఖర్చులు, శ్రమ, పనుల్లో జాప్యం, కుటుంబంలో ఇబ్బందులు.
పరిహారాలు: ఆవునెయ్యితో అమ్మవారి దేవాలయంలో దీపారాధన, గోవులకు కూరగాయలను తినిపించి ప్రదక్షణ చేసి నమస్కారం చేసుకోండి దోషాలు పోతాయి.

కర్కాటకరాశి: అనుకూలం. పనుల్లో వేగం, సంతోషం, కార్యజయం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దైవనామస్మరణ.

సింహరాశి: శుభం, ధనలాభం, దైవకార్యాలు చేస్తారు, ప్రయత్నాలు సఫలం.
పరిహారాలు: ఆవునెయ్యితో అమ్మవారికి/శివాలయంలో లేదా ఏదైనా దగ్గర్లోని దేవాయలంలో దీపారాధన చేయండి.

కన్యారాశి: మంచి ఫలితాలు, భార్య వలన లాభం, కుటుంబంలో సంతోషం, బంధువుల సహకారం,పనులు పూర్తి.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, గోసేవ చేసుకోండి మంచిది.

తులారాశి: చిన్నచిన్న ఇబ్బందులు, విజయం, స్నేహితుల వల్ల సంతోషం, బంధువర్గానికి సంబంధించి చెడువార్తలు వింటారు.
పరిహారాలు: ఉదయాన్నే రావిచెట్టుక శుద్ధ జలాన్ని సమర్పించి ప్రదక్షిణలు చేయండి.

వృశ్చికరాశి: ఇబ్బందులు, అనారోగ్యం, అనవసరంగా కాలయాపన, పనుల్లో పురోగతి.
పరిహారాలు: సూర్యునికి నమస్కారాలు, అర్ఘ్యం వదలం చేయండి శరీర సమస్యలు పోతాయి.

ధనస్సురాశి: అనుకూలం. ధనలాభం, దైవకార్యం, పనుల్లో వేగం.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, దైవనామస్మరణతో మంచి జరుగుతుంది.

మకరరాశి: అనుకూలం, స్నేహలాభం, బాకీలు వసూలు, విద్యార్థులకు అనుకూలం.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, దేవాలయ ప్రదక్షణలు చేయండి మంచిది.

కుంభరాశి: లాభం, ఆరోగ్యం, పనులు పూర్తి, అలసట, కార్యవిజయం.
పరిహారాలు: ఆవునెయ్యితో వేంకటేశ్వరస్వామికి దీపారాధన మేలు చేస్తుంది.

మీనరాశి: అనుకూలం, విందులు, ప్రయాణ సూచన, వస్త్రలాభం.
పరిహారాలు: ఆవునెయ్యితో ఇంట్లో దీపారాధన చేయండి చెడు ఫలితాలు పోతాయి.

-కేశవ