వేంకటేశ్వరస్వామికి ఈరోజు ప్రత్యేక అర్చనలు చేస్తే ఈరాశివారికి మంచిది! మార్చి 28 రాశిఫలాలు

-

మార్చి 28 గురువారం- రోజువారి రాశిఫలాలు

మేషరాశి: ప్రతికూల ఫలితాలు, కార్యభంగం, అశాంతి, వస్తునష్టం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి ఈరోజు అష్టోతర పూజ లేదా తులసీమాలతో అర్చన చేయించుకోండి శుభం జరుగుతుంది.

వృషభరాశి: మిశ్రమ ఫలితాలు, వస్త్రలాభం, స్నేహితులతో విందులు, భార్యతో విబేధాలు, వ్యాపారంలో చిక్కులు.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి / శ్రీకృష్ణుని దేవాలయంలో తులసీమాలతో ప్రత్యేక పూజ చేయించుకోండి మంచి జరుగుతుంది.

మిథునరాశి: అనుకూలమైన ఫలితాలు, వ్యాపారాభివృద్ధి, ధనలాభం, గుర్తింపు, గౌరవం.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, తల్లిదండ్రులకు పాదనమస్కారం చేసుకోండి మేలు జరుగుతుంది.

కర్కాటకరాశి: మిశ్రమంగా ఉంటుంది. కార్యసాధన, ఇంట్లో విబేధాలు, వస్తువులు కొంటారు. పనులు నెమ్మదిగా పూర్తి.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి పూజ, పసుపు రంగు దుస్తుల ధారణ, తులసీమాలతో అర్చన మంచి ఫలితాలను ఇస్తాయి.

సింహరాశి: ప్రతి పనిలో ఇబ్బంది, వాప్యారంలో ఇబ్బందులు, వస్తు నష్టం, ఆందోళన.
పరిహారాలు: గురుగ్రహానికి ప్రత్యేక పూజ చేయించుకోండి, నవగ్రహాల దగ్గర పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయండి.

కన్యారాశి: ప్రతి పనులో వ్యతిరేకం, ఇబ్బందులు, వస్తునష్టం, ధననష్టం.
పరిహారాలు: నవగ్రహలకు దీపారాధన, పూజ చేయించండి. వీలైతే వేంకటేశ్వరస్వామికి అర్చన చేయించుకోండి.

తులారాశి: అనుకూలమైన ఫలితాలు, భార్యతో కలిసి ప్రయాణం, కొత్త పరిచయాలు, పనులు పూర్తి, కుటుంబంలో సఖ్యత.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, గోసేవ చేసుకోండి మంచిది.

వృశ్చికరాశి: మిశ్రమ ఫలితాలు, లాభం, అలసట, ఆర్థిక ఇబ్బందులు, పనుల్లోజాప్యం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి పొంగలి నైవేద్యం లేదా శివాభిషేకం చేసుకోండి.

ధనస్సురాశి: మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారంలో ఆటంకం, వస్తులాభం, కార్యజయం, పనుల్లో చికాకులు.
పరిహారాలు: సాయిబాబా దేవాలయంలో ధునిలో కొబ్బరికాయ సమర్పణ లేదా హారతుల్లో పాల్గొనండి మేలు జరుగుతుంది.

మకరరాశి: అనుకునేది ఒకటి జరిగేది మరొకటి, వస్తునష్టం, ధనవ్యయం, భయం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి తులసీమాలతో అర్చన, గులాబీలతో అర్చన మంచి ఫలితాలను ఇస్తుంది.

కుంభరాశి: అనుకున్నవి పూర్తి, లాభం, వస్తులాభం, కార్యసిద్ధి, పరిచయాలు.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి పొంగలి/రవ్వకేసరి నైవేద్యంగా సమర్పించండి.

మీనరాశి: ప్రతి పని విజయవంతం, బంధువుల రాక, కార్య ప్రయత్నం సఫలం, లాభం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి ఆరాధన, దేవాలయ ప్రదక్షణలు, పూజ మంచి ఫలితాన్ని ఇస్తుంది.

-కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version