చిన్నికృష్ణ.. నా కాళ్లు పట్టుకున్నావ్.. నీ గతం మర్చిపోకు.. ఆకుల శివ అదిరిపోయే పంచ్..!

-

రీసెంట్ గా పవన్ కళ్యాణ్ మీద.. మెగాస్టార్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన రైటర్ చిన్ని కృష్ణకు మెగా ఫ్యాన్స్, జనసేన ఫ్యాన్స్ ఘాటు రిప్లైలు ఇచ్చారు. అయితే చిన్ని కృష్ణ వ్యాఖ్యలకు మరో రైటర్ ఆకుల శివ లేటెస్ట్ గా స్పందించడం జరిగింది. ఎన్నో మంచి సినిమాలకు రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆకుల శివ ఇదవరకు ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రాలేదు కాని రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ ఆకుల శివ ఏమన్నాడు అంటే.. చిన్ని కృష్ణ నీ గతం మర్చిపోయి మాట్లాడుతున్నావ్.. అసలు నీకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల గురించి మాట్లాడే అర్హత ఉందా.. చిరంజీవి ఒకపూట భోజనం పెట్టలేదని అన్నావ్.. నీ గురించి తెలిసిన వారెవ్వరూ ఇంటికి పిలవరు.

కులం బట్టి కాదు గుణం బట్టి మనకు విలువ ఇస్తారు. ఎన్నోసార్లు నా దగ్గరకు వచ్చి ఏడ్చావు.. నా కాళ్లు పట్టుకున్నవ్.. చిన్ని కృష్ణ గతం గురించి మర్చిపోయి మాట్లాడుతున్నావ్.. పవన్ ను కలిపించమని ఎన్నోసార్లు బ్రతిమిలాడావ్.. ఇప్పుడు నువ్వు పవన్ నవరంధ్రాలు మూసుకునే విషయాలను బయట పెడతావా.. ముందు నీ పుస్తకాలు తెరిస్తే నువ్వేంటో జనాలకి తెలుస్తుంది.. ఆ పుస్తకాలు తిరగేయమంటావా అంటూ చిన్ని కృష్ణకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ఆకుల శివ. నువ్వు వైసిపి కండుగా కప్పుకుంటే అది నీ ఇష్టం జగన్ విధివిధానాలు చెప్పు అంతేకాని చిరంజీవి, పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయాల్లోకి వెళ్లకని ఆకుల శివ స్పెషల్ వీడియో మెసేజ్ ఇచ్చారు. ఇంతటితో ఆపితే బెటర్ లేదంటే నువ్వు మాట్లాడితే మళ్లీ నేను మాట్లాడాల్సి వస్తుందని అన్నారు ఆకుల శివ.

Read more RELATED
Recommended to you

Exit mobile version