డిసెంబర్‌ 08 మంగళవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

రాశిఫలాలు- డిసెంబర్‌-8- మంగళవారం.

మేషరాశి:ఈరోజు మిశ్రమ ఫలితాలు !

కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులు ఒత్తిడులు పెంచుతారు. ఆప్తులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగమార్పులు. ఈరోజు మీరు పని చేసే చోట అనుకూలంగా ఉండదు. మీ భాగస్వామి మాటలు మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది. సహచరులు సాయం చేస్తారు. కొత్త ప్రాజెక్ట్ లు కలిసొచ్చే అవకాశం ఉంది. కుజగ్రహ ఆరాధన చేయండి.

todays horoscope

వృషభరాశి:ఉద్యోగాలలో పురోగతి !

ఇతరులను నమ్మి మోసపోయే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు నూతన జ్ఞానం లభిస్తుంది. మీ పనులను మీరే పూర్తి చేసుకోవడం ఉత్తమం. లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యవహారాలలో విజయం వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి. సమీ సోదరుల సాయంతో నిలిచిపోయిన పనులు పూర్తి అవుతాయి. న్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. నవగ్రహస్తోత్రం పారాయణం చేయండి.

 

మిథునరాశి:ఆనందంగా గడుపుతారు !

ఈరోజు మీ పనులకు ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన. పనులు సకాలంలో పూర్తి. . మీ జీవిత భాగస్వామి నుంచి ఆర్ధిక పరిస్థితి బలపడుతుంది. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి. మీ కుటుంబ వాతావరణం ప్రశాంతంగా స్నేహపూర్వకంగా ఉంటుందిఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీ జీవిత భాగస్వామిని పరిచయస్తులను సంప్రదించండి. శ్రీగణపతి ఆరాధన చేయండి.

 

కర్కాటకరాశి:వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు !

భవిష్యత్ కోసం మీరు కొంత ఆదా చేయగలుగుతారు. పెట్టుబడులు లాభ దాయకంగా ఉంటాయి. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు. రుణదాతల నుంచి ఒత్తిడులు. సామజిక పనుల ద్వారా మీ కీర్తి విస్తరిస్తుంది. బిజీగా ఉన్న సమయంలో మీ కోసం కూడా కొంత సమయాన్ని కేటాయించగలుగుతారు. అది మీకు లాభం చేకూరుస్తుంది. పనులలో ప్రతిష్ఠంభన. బంధుమిత్రులతో వివాదాలు. శివుడికి నెయ్యితో అభిషేకం చేయించండి.

 

సింహరాశి:ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది !

వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు. మీ సహోద్యోగుల పట్ల ఉదరంగా ప్రవర్తిస్తారు. ఈరోజు కొంత ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. పరిస్థితులు కొంత ఆందోళనకరంగా మారినప్పటికీ మీరు వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొనగలుగుతారు. విదేశాల నుంచి విద్యార్థులు శుభవార్తలు పొందే అవకాశం ఉంది. వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో స్వల్ప విభేదాలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. కాలభైరవరాధన చేయండి.

 

కన్యరాశి:కుటుంబ సభ్యులతో గడుపుతారు !

పని వాతావరణంలోని పరిస్థితులు కొంత ఇబ్బందిని కలిగిస్తాయి. ఉద్యోగయత్నాలు సఫలం. ప్రముఖులతో పరిచయాలు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు. ఉపాధి రంగంలోని వారికి గౌరవం పెరుగుతుంది. మీకు ఇష్టమైన వారి గురించి మీరు ఆందోళన చెందుతారు. వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. ఇష్టదేవతరాధన చేయండి.

 

తులరాశి:పాత బాకీలు వసూలవుతాయి !

శుభకార్యాలలో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వ్యవహారాలలో విజయం. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం, ఆస్తులను కొనుగోలు చేయడం మంచిది కాదు. మీరు ఎంచుకున్న రంగంలో ఇతరులపై ఆధారపడకుండా ముందుకు వెళ్లడం  ఉత్తమం. కుటుంబ సమస్యలను సహనంతో పరిష్కరించుకుంటారు. శ్రీసూక్త పారాయణం చేయండి.

 

వృశ్చికరాశి:మనసులోని మాటలను బయటకు చెప్తారు !

మిశ్రమ ఫలితాలు. ఉపాధి కోరుకునే వారికి శుభవార్త వినే అవకాశం ఉంది. నూతన ఆదాయ వనరుల గురించి కొంత సమాచారం పొందుతారు. కొన్ని భావోద్వేగాలతో మీ మనసులోని మాటలను బయటకు చెప్తారు. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. చేపట్టిన పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. మీ ఔదార్యం మీకు మాత్రమే వస్తుంది. కుటుంబ సభ్యులనుంచి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకూల ఫలితాల కోసం శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.

 

ధనుస్సురాశి:ఉద్యోగయత్నాలు నిదానంగా సాగుతాయి !

మిశ్రమ ఫలితాలు. ఈరోజు అనుకున్న పనులు ముందుకు సాగవు. ఉద్యోగయత్నాలు నిదానంగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, చాలా కాలం తరువాత మీరు శుభవార్తలు వినే అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారతాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి మీ చెంతకు చేరుతుంది. అనుకున్న లక్ష్యాలతో మీరు విజయానికి చేరువ అవుతారు. మీరు చేసే అన్ని ప్రయత్నాల్లోనూ మీకు జీవిత భాగస్వామి తోడుగా ఉంటారు. దుర్గాదేవి దగ్గర దీపాన్ని పెట్టండి.

 

మకరరాశి:అనేక సమస్యలతో బాధపడతారు !

ఈరోజు అనేక సమస్యలతో బాధపడతారు. మీరు ఆర్ధిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. కోర్టు కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి. పోటీపరీక్షల్లో విజయం. శుభవర్తమానాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఎదురుండదు. పని చేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీ మనస్సు తేలికగా ఉంటుంది. దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. శ్రీదుర్గాసూక్తపారాయణం చేయండి.

కుంభరాశి:ఆకస్మిక ప్రయాణాలు !

ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మీరు కొన్ని తప్పుడు ఆరోపణలు ఎదుర్కొనే అవకాశం ఉంది. వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి. కుటుంబసభ్యులతో వివాదాలు. కుటుంబ జీవితం దెబ్బతింటుంది. ప్రేమ జీవితంలో ఆహ్లదకరంగా ఉంటుంది. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. శ్రీలక్ష్మీగణపతిని ఆరాధించండి.

 

మీనరాశి:వ్యాపారంలో విజయాన్ని పొందుతారు !

నూతన వ్యాపారంలో విజయాన్ని పొందుతారు. వాణిజ్యంలో పెట్టుబడులు పెట్టడం వలన మీరు ఆర్ధికంగా బలోపేతం అవుతారు. నూతన ఆదాయ వనరులు లభిస్తాయి. భవిష్యత్తు కోసం మీరొక ధృడమైన నిర్ణయం తీసుకోగలుగుతారు. తల్లితండ్రుల ఆశీర్వాదం ఉంటుంది. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. వ్యవహారాలు సాఫీగాసాగుతాయి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. శ్రీశివాభిషేకం మంచి ఫలితాన్నిస్తుంది.

  • శ్రీ

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version