రాశి ఫలాలు: ముక్కోటి ఏకాదశి రోజు ఇలా చేస్తే అన్ని అనుకూల ఫలితాలే

-

(డిసెంబర్ 16-22 వరకు 12 రాశుల ఫలితాలు)

మేషరాశి: ఈరాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితం, శుభకార్యాలలో పాల్గొంటారు. అనవసర భయాలు ఉంటాయి. వ్యాపార రంగంలో పోటీ ఉంటుంది. అయినా విజయం సాధిస్తారు. రాజకీయంగా మిశ్రమ ఫలితాలు. ఉద్యోగులకు జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా బాగుంటుంది. కానీ జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో సంతోష వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శివాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణం/శ్రవణం మంచి ఫలితాలను ఇస్తుంది.

వృషభరాశి: అనుకూల ఫలితాలు. ఆర్థికంగా బాగుంటుంది. వేరే వారి ప్రమేయం లేకుండా చూసుకోండి. ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. భవిష్యత్ కోసం మీరు చేసే ఆలోచనలు అనుకూలిస్తాయి. రాజకీయంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పిల్లల విషయంలో సమస్యలు పరిష్కారమవుతాయి. స్థిరాస్తి సంబంధాలు
శుభకార్యాలు, ప్రయాణాల కోసం ఎక్కువగా ఖర్చు అవుతుంది. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్‌లో ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగులకు సాధారణంగా ఉంటుంది. నిరుద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముక్కోటి ఏకాదశి దేవాలయ దర్శనం, ఉపవాసం చేయండి.

మిథునరాశి: ఈవారం అన్ని అనుకూల ఫలితాలే. ఆదాయం పెరుగుతుంది. ఈ వారం ఎక్కువగా శ్రమిస్తారు. దుబారాను అదుపుచేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు నియంత్రించుకుంటారు. కుటుంబంలో సంతోష వాతావరణం. దగ్గరి బంధువుల నుంచి ఆహ్వానాలు. అందరితో ప్రేమతో ఉంటారు. వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు చిన్నచిన్న ఇబ్బందులు ఉంటాయి. అనుభవంతో వాటిని మీరు అధిగమిస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టకండి. మానసింకంగా బలంగా ఉంటారు. వైకుంఠ ఏకాదశి ఉపవాసం చేయండి. మారేడు దళాలతో విష్ణుపూజ చేయండి.

కర్కాటకరాశి: ఈ వారం సాధారణ ఫలితాలు ఉంటాయి. కొన్ని ముఖ్యమైన విషయాల్లో మెతక వైఖరి ప్రదర్శించకండి. మీ మంచితనాన్ని ఇతరులకు ఆసరాగా చేసుకోనివ్వకండి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారపరంగా అనుకూలం. శుక్ర, శని వారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబపరంగా సంతోషంగా ఉంటారు. ఆర్థికపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. ఆరోగ్యంగా బలంగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఏకాదశి వ్రతం చేయండి. విష్ణుపారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది.

సింహరాశి: ఈవారం అనుకూలంగానే ఉంటుంది. కానీ పనుల వల్ల విశ్రాంతి, వ్యవహారాలతో విరామం దొరకదు. ధైర్యంతో పనులు చేయండి. మీలో విశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలం.
స్థిరాస్థి కొనుగోలుకు అనుకూలం. వ్యాపారులకు అనుకూల సమయం. వ్యాపార పరమైన విషయాల్లో నిరక్ష్యం, అలసత్వం ప్రదర్శించవద్దు. ఉద్యోగులకు సాధారణంగా ఉంటుంది. కిందివారితో చిన్నచిన్న బేధాభిప్రాయాలు వస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. హనుమాన్‌చాలీసా పారాయణం చేయండి.

కన్యారాశి: ఈవారం మిశ్రమంగా ఉంటుంది. భగవంతుడిపై భారం వేసి పనులుచేయండి అన్నింటా విజయం సాధిస్తారు. రాజకీయంగా మంచిగానే ఉంటుంది. మానసికంగా సంతోషంగా ఉంటారు. మధ్యవర్తిత్వాలు వహించకండి. అప్పులు ఇయ్యకండి. ఉద్యోగపరంగా ఒత్తిడి ఉంటుంది. దూరప్రయాణాలు చేయకండి. వ్యాపారులకు అంత అనుకూలంగా ఉండదు. రియల్ ఎస్టేట్ వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికంగా చాలా అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ పరంగా సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విష్ణుపూజ, దేవాలయ సందర్శన మంచి ఫలితాలు ఇస్తాయి.

తులరాశి: ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు. దైవానుగ్రహంతో విజయాలు సాధిస్తారు. పిల్లల విషయంలో కొంత ఇబ్బంది ఎదురవుతుంది. మానసిక ధైర్యంతో ఉంటారు. సంశయాలతో ఈవారం గడిచిపోతుంది. కొత్త ప్రయత్నాలు చేయకండి. ప్రతి పనుల్లో జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సమస్యలు రావచ్చు. ఉద్యోగపరంగా ఇబ్బంది ఉంటుంది. కొత్త ప్రయత్నాలు అనుకూలించవచ్చు. వ్యాపారులకు పోటీ ఎదురైనా మీరే విజయం సాధిస్తారు. రియల్‌ఎస్టేట్ అనుకూలం. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన బాకీలు కొంతమేర వసూలు అవుతాయి. కుటుంబ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ముక్కోటి ఏకాదశినాడు గోసేవ చేయండి మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

వృశ్చికరాశి: ఈరాశివారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీ తెలివితేటలు మిముల్ని సమాజంలో మీకు మంచిపేరు తెస్తాయి. వ్యాపారరంగంలో వారికి అనుకూలంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు అనుకూలం. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. కుటంబంలో సంతోషం ఉంటుంది. ఆరోగ్యంగా బాగుంటుంది. కొత్త పనుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శివ, విష్ణుపూజ మంచి ఫలితాలు ఇస్తాయి.

ధనస్సురాశి: ఈవారం ధనస్సువారికి అనుకూలమైన వారం. ప్రతిదానిలో పనిలో ముందుకు వెళ్తారు. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. రియల్‌ఎస్టేట్ వారికి అనుకూలం. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి. అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థికవ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కుటంబంలో సంతోష వాతావరణం ఉంటుంది. రుణాలు ఇవ్వకండి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. గోసేవ, హనుమాన్ దేవాలయ సందర్శన మంచి ఫలితాలు ఇస్తాయి.

మకరరాశి: ఈరాశివారికి అనుకూలంగా ఉంటుంది. పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆర్థికంగా, కుటుంబ, ఉద్యోగపరంగా వారికి అనుకూల ఫలితాలు. వ్యాపారులకు అనుకూలమైన వారం. పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం. రియల్ ఎస్టేట్ వారికి లాభాలు వస్తాయి. ఉద్యోగులకు మంచి ఫలితాలు లభిస్తాయి. నిర్లక్ష్యంగా ఉండవద్దు. ఆర్థికంగా పూర్తిగా అనుకూలం. కుటుంబంలో సంతోష వాతావరణం. కొత్త వస్తువులను కొంటారు. ఆరోగ్యం బాగుటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణం/శ్రవణం, లక్ష్మీ దేవాలయ సందర్శన మంచిది.

కుంభరాశి: ఈవారం చాలా సానుకూల వాతావరణం. పనుల ఒత్తిడి ఉంటుంది. ప్రతి విషయంలో నిదానంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వేరేవారి ప్రమేయాలను అంగీకరించకండి. కుటుంబంలో సంతోషంగా ఉంటారు.
రియల్ ఎస్టేట్ వారు కొత్త వ్యక్తుల విషయలో చాలా జాగ్రత్తగా ఉండండి.
బంధువులతో సఖ్యత, సంతోష వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా బాగుటుంది. ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దేవాలయ సందర్శన, గోపూజ, దానాలు మంచి ఫలితాలు ఇస్తాయి. శివాభిషేకం మంచిది.

మీనరాశి: ఈరాశివారికి అనుకూల వారం. అదృష్టకాలం. గతంలోని పరిచయాలు ఈ వారం లాభిస్తాయి. వ్యాపారులకు అనుకూలం. కొత్త ప్రణాళికలు, పనులు చేయడానికి అనుకూలం. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలం. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి. ప్రతి సందర్భంలో మీ పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. కుటుంబలో చిన్నచిన్న మార్పులు జరుగుతాయి. ఖర్చులు పెరిగే అవకాశం. కానీ అవి మీకు మంచే చేస్తాయి. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. బంధువులతో బేధాభిప్రాయాలు తొలిగిపోతాయి. ఆరోగ్యం మంచిగా ఉంటుంది. దేవాలయ సందర్శన, ఇష్టదేవతారాధనతో మంచి ఫలితాలు వస్తాయి.

-కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version