ఫిబ్రవరి 13 శనివారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

Join Our Community
follow manalokam on social media

ఫిబ్రవరి – 13 – మాఘమాసం – శనివారం.

 

మేష రాశి:నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఖర్చులకు దూరంగా ఉండడం వల్ల ధన లాభం కలుగుతుంది. అందరితో సఖ్యతగా, ఆనందంగా ఉంటారు. విద్యార్థులు బాగా చదువుకొని పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. అనారోగ్యాలను తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసి సమస్త కార్య సిద్ధి పొందుతారు.

పరిహారాలు: ఈరోజు బాలా త్రిపురసుందరి అమ్మవారిని ఆరాధించండి.

 

todays horoscope

వృషభ రాశి:వ్యాపారాల్లో నష్టాలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పులు ఇవ్వడం తీసుకోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఇబ్బందులు. వ్యాపారాల్లో నష్టాలు ఏర్పడతాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. వివాహ ప్రయత్నాలు అనుకూలించవు. విద్యార్థులు చదువు విషయంలో నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి.

పరిహారాలు: నవగ్రహ  ఆరాధన చేయండి, దగ్గర్లో ఉన్న ఆలయానికి వెళ్లి నవగ్రహాలకు 11 ప్రదక్షిణాలు చేయండి.

 

మిధున రాశి:సోదరులతో విభేదాలు !

ఈరోజు ప్రయోజకరంగా లేదు. చెప్పుడు మాటల వల్ల మోసపోతారు. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. సోదరులతో విభేదాలు ఏర్పడతాయి. అనవసరపు విషయాలు చర్చించడం వల్ల నష్టం జరుగుతుంది. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించండి. ప్రయాణాలు అనుకూలించవు. వ్యాపారాల్లో నష్టాలు ఏర్పడతాయి.

పరిహారాలు: ఈరోజు సంకష్టహర గణపతిని ఆరాధించండి, దగ్గర్లో ఉన్న గణపతి ఆలయానికి వెళ్లి గరికను సమర్పించండి.

 

 కర్కాటక రాశి:ఈరోజు మొండి బకాయిలు వసూలు !

ఈరోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. మొండి బకాయిలు వసూలు చేసుకుంటారు. ధన యోగం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అనుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. గతంలో పోగొట్టుకున్న ఉద్యోగాన్ని, వస్తువులను తిరిగి పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉద్యోగ అవకాశాలు పొందుతారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. అనారోగ్యాలకు దూరంగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాన్ని జరుపుతారు.

పరిహారాలు: నారాయణ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

సింహరాశి:మానసిక అనారోగ్యం !

ఈరోజు అనుకూలంగా లేదు. మీలో ఉన్న తొందరపాటు తనం వల్ల నష్టం జరుగుతుంది. కోపంగా మాట్లాడడం వల్ల మీకు సహాయం చేసే వారిని దూరం చేసుకుంటారు. శత్రువులను దగ్గర చేసుకుంటారు. మానసిక అనారోగ్యం ఏర్పడుతుంది. ధననష్టం కలుగుతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. తక్కువ మాట్లాడడం మంచిది. వ్యాపారాల్లో నష్టాలు ఏర్పడతాయి.

పరిహారాలు: దుర్గాదేవి ఆరాధన చేసుకోండి, వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయండి.

 

కన్యారాశి:ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. కష్టమైన పనినైనా ధైర్యంగా, సాహసంగా ఎదుర్కొంటారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. మిత్ర లాభం కలుగుతుంది. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉత్తమ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పదోన్నతులు కలుగుతాయి. కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. మీ మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు.

పరిహారాలు:ఈరోజు కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

 

తులారాశి:ప్రయాణాలకు అనుకూలం !

ఈరోజు అనుకూలంగా లేదు. విలువైన వస్తువులు ఎక్కడైనా పడిపోయే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఉద్యోగస్తుల కార్యాలయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. పెద్దవారి సూచనలతో శుభ కార్యాలు ఫలిస్తాయి. ప్రయాణాలకు అనుకూలం. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. సోదరులతో సఖ్యత కోల్పోతారు. విద్యార్థులు చదువు విషయంలో జాగ్రత్త.

పరిహారాలు:ఆంజనేయ స్వామి దండకం పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి:ఈరోజు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు !

‌ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని మంచి అవకాశాలను పొందుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ప్రమోషన్లు కలుగుతాయి. కష్టానికి తగ్గ ఫలితం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. అప్పుల బాధలు తీర్చుకుంటారు. ధన యోగం కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. కొత్త వ్యాపారాలను  ప్రారంభించడం వల్ల అధిక లాభాలు కలుగుతాయి.

పరిహారాలు:అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి:పోటీ పరీక్షల్లో విజయం !

ఈరోజు బాగుంటుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అనుకూలత. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు. కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంటు ఉద్యోగం కలుగుతుంది. అనారోగ్యాలకు దూరంగా ఉండి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా చదువుకొని పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.

పరిహారాలు:లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

 

మకర రాశి:ఆహారానికి ప్రాధాన్యతనిస్తారు !

ఈరోజు ఆనంద యోగంగా ఉంటుంది. సాంప్రదాయక ఆహారానికి ప్రాధాన్యతనిస్తారు. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. గతంలో పోగొట్టుకున్న ఉద్యోగాన్ని, వస్తువులను తిరిగి పొందుతారు. మీ మాట తీరు వల్ల అందరి ఆదరణ పొందుతారు.విద్యార్థులు బాగా చదువుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించడం వల్ల అధిక లాభాలు కలుగుతాయి. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు.

 పరిహారాలు:శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించండి.

 

కుంభరాశి:ఈరోజు కార్యాలయాల్లో అనుకూలతలు !

ఈరోజు బాగుంటుంది. విద్యార్థులు బాగా చదువుకుని పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అనుకూలతలు ఏర్పడతాయి. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉంటారు. ధన యోగం కలుగుతుంది. వ్యాపారాలను విస్తరించడం వల్ల అధిక లాభాలు కలుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. గృహంలో వేడుక జరుపుతారు.

పరిహారాలు:శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మీన రాశి:వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు !

ఈరోజు అనుకూలంగా లేదు. విద్యార్థులు చదువు మీద అశ్రద్ధ ఉండడం వల్ల ఇబ్బందులు  ఎదురవుతాయి. వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ప్రమాదాలు. కార్యాలయాల్లో ఇబ్బందులు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. ప్రయాణాలకు అనుకూలం.

పరిహారాలు:ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

TOP STORIES

నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది....