జనవరి 07 గురువారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

జనవరి – 7- మార్గశిరమాసం – నవమి- గురువారం.

మేషరాశి: ఈరోజు పోటీపరీక్షల్లో రాణిస్తారు !

ఈరోజు బాగుంటుంది. ఈరోజు సంపాదనకు ప్రాధాన్యతనిస్తారు. ఆరోగ్యం విషయంలో బాగుంటారు. ఈరోజు పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు ఉద్యోగస్తులకు ఆఫీసులో అనుకున్న చోటుకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు కలుగుతాయి. ఈరోజు సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. తీర్థయాత్రలు చేస్తారు. వాహన కొనుగోలు చేస్తారు. ఈరోజు నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా చదువుకొని పోటీపరీక్షల్లో రాణిస్తారు.

పరిహారాలుః ఈరోజు శివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి.

todays horoscope

వృషభ రాశి: వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి !

ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. ఇంతకు ముందు పోయిన డబ్బులను, వస్తువులను ఈరోజు పొందుతారు. ఈ రోజు ధన లాభం కలుగుతుంది. భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. ఈరోజు విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ఈరోజు బంధువుల రాక సంతోషాన్ని ఇస్తుతుంది. ఈరోజు అక్క చెల్లెలు సన్నిహితంగా ఉంటారు. ప్రయాణాలకు  కలిసి వస్తుంది. ఈరోజు అనారోగ్యం అంతా పోయి ఆరోగ్యంగా ఉంటారు.

పరిహారాలుః ఈరోజు శ్రీ హయగ్రీవ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి: ఈరోజు వ్యాపారస్తులకు స్వల్ప నష్టం !

ఈరోజు ప్రతికూల ఉంటాయి. ఈరోజు కష్టపడి ఫలితం ఉంటుంది. ఈరోజు కొత్త వ్యక్తులతో పరిచయాలు పెట్టుకోవడం మంచిది. డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. ఈరోజు వాదోపవాదాలకు, కోపాలకు దూరంగా ఉండటం మంచిది, లేదంటే ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఈరోజు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం మంచిది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో స్వల్ప నష్టం కలిగే అవకాశం ఉంటుంది.

పరిహారాలుః ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి: ఈరోజు ప్రయాణాలకు ఇబ్బంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు విలువైన వస్తువులను, డబ్బులను జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు వివాదాలకు, తొందరపాటు తనానికి దూరంగా ఉండటం మంచిది. ఈరోజు విద్యార్థులు బాగా కష్టపడి చదువుకోవడం మంచిది. ఈరోజు ప్రయాణాలకు ఇబ్బంది. ఈరోజు విహారయాత్రలు, తీర్థయాత్రలు చేయకుండా ఉండటం మంచిది.

పరిహారాలుః ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

 

సింహరాశి: ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది !

ఈరోజు అంతా అనుకూలంగా ఉంటుంది. రోజంతా కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో సంతోషంగా ఉంటారు. ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారస్తులు వ్యాపార లాభాలు పొందుతారు. ఇంతకుముందు పోగొట్టుకున్న వస్తువులను ఈరోజు తిరిగే అనందుకుంటారు. ఈరోజు వివాహాది శుభకార్యాలు ఫలిస్తాయి, వివాహ నిశ్చయ తాంబూలాలు తీసుకుంటారు. ఈరోజు గ్రహంలో శుభకార్యాన్ని జరుపుతారు. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు.

పరిహారాలుః ఈరోజు శ్రీ లక్ష్మి అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి: ఈరోజు  ఉద్యోగంలో ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు అనవసరపు విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు తక్కువగా మాట్లాడడం మంచిది. ఈరోజు  ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉద్యోగంలో ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకోవడం మంచిది.

పరిహారాలుః ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

 

తులారాశి: ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు !

ఈరోజు బాగుంటుంది. విద్యార్థులు బాగా చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. నూతన గృహాన్ని కొనుగలుగుతారు. వివాహ నిశ్చయ తాంబూలాలు తీసుకుంటారు. ఈరోజు మీ గృహంలో శుభసంబంధ వేడుకలు నిర్వహిస్తారు. ఈరోజు ఆరోగ్యంగా ఉంటారు. ఇంతకుముందు ఉన్న అనారోగ్యం నుంచి విముక్తి కలుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారస్తులకు ఆర్థిక లాభాలు కలుగుతాయి.

పరిహారాలుః ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి: ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు మీరు తప్పులు చేసే అవకాశం ఉంది. తొందరగా ఎవరిని నమ్మకుండా ఉండటం మంచిది. ఈరోజు డబ్బు విషయంలో ఎవరైనా మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు తక్కువగా మాట్లాడడం మంచిది. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఈ రోజు చిన్నచిన్న ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు ఏ విషయాల్లో అయినా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. తల్లిదండ్రుల మాటలను, పెద్ద వారి వారి మాటలను గౌరవించడం మంచిది. వ్యాపారస్తులకు వ్యాపార నష్టం జరిగే అవకాశం ఉంటుంది.

పరిహారాలుః ఈ రోజు లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి: పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు !

ఈ రోజు బాగుంటుంది. ఈరోజు ఏ పని చేసిన కలిసి వస్తుంది. అప్పుల బాధలు తీరుతాయి. కుటుంబ సభ్యులతో అందరితో కలిసిమెలిసి సఖ్యతగా ఉంటారు. ఈరోజు విద్యార్థులు కష్టపడి బాగా చదువుకొని పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు కలుగుతాయి. ఈ రోజు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. ఉద్యోగస్తులు ఉద్యోగంలో ఉన్నత స్థానమును పొందుతారు. ఈరోజు గృహంలో శుభకార్యాన్ని జరుపుతారు.

పరిహారాలుః ఈరోజు శ్రీదక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

మకర రాశి: ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు !

ఈరోజు అంతా బాగుంటుంది. ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు.  ఈ రోజు భార్య భర్తలు కలిసి మెలిసి అన్యోన్యంగా ఉంటారు. ఈ రోజు వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు కలుగుతాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో ఉత్తీర్ణత పొందుతారు. ఈరోజు గృహాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో బాగుంటారు. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఏ పనిలో అయినా అయినా ఆదరణ పొందుతారు.

పరిహారాలుః శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి: ఈరోజు చాలా బాగుంటుంది !

ఈరోజు చాలా బాగుంటుంది. ఇంతకుముందు ఎవరికైనా డబ్బులు ఇస్తే వాళ్ళు ఈ రోజు తిది తిరిగి ఇస్తారు. ఈ రోజు ధన లాభం కలుగుతుంది. విలువైన వస్తువులను స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. రోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు. వ్యాపారస్తులకు వ్యాపారంలో అధిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు.  ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు. ఈరోజు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు.

 పరిహారాలుః ఈరోజు శ్రీకాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

 

మీనరాశి: విలువైన వస్తువులు జాగ్రత్త !

ఈ రోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. శ్రమ ఎక్కువై అసహనం తెచ్చుకుంటారు. ఈరోజు ఒంటరిగా ప్రయాణం చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఈరోజు విద్యార్థుల విద్య మీద శ్రద్ధ పెట్టడం మంచిది. తల్లిదండ్రులు చెప్పినట్లు వినండి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ రోజు విలువైన వస్తువులు జాగ్రత్త. వాహనాలను జాగ్రత్తగా నడవపండి. ఈరోజు వ్యాపారస్తులకు స్వల్ప నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు తొందరగా ఎవరిని నమ్మకుండా ఉండటం మంచిది. ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.

పరిహారాలుః ఈరోజు శ్రీదుర్గాదేవి స్తోత్రం పారాయణం చేసుకోండి.