జనవరి 13 బుధవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

జనవరి – 13- భోగి  – బుధవారం – మార్గశిర మాసం.

 

 మేష రాశి:నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం !

ఈరోజు శుభ కరంగా ఉంటుంది. ఈరోజు విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. అప్పుల బాధలు తీరిపోయి.  మొండి బాకీలు  వసూలు చేసుకొని ధన లాభం పొందుతారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి సంతోషంగా, సఖ్యతగా ఉంటారు.

పరిహారాలుః ఈరోజు శ్రీహయగ్రీవ అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

todays horoscope

వృషభ రాశి:ప్రయాణ లాభాలు కలుగుతాయి !

ఈరోజు  ఏ విషయంలో అయినా తొందర పడకుండా ఉండటం మంచిది. ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. అవసరం ఖర్చులకు దూరంగా ఉంది ధన లాభం పొందుతారు. పెద్ద వారితో మాట్లాడేప్పుడు చాలా నెమ్మదిగా, సౌమ్యంగా మాట్లాడడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడానికి శ్రద్ధ చూపుతారు.  ప్రయాణ లాభాలు కలుగుతాయి. స్థిరాస్తుల కొనుగోలుకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం అభివృద్ధి చేందుతుంది, లాభాలు పొందుతారు. సువర్ణ అభరణాలను కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః ఈరోజు మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి:ఈరోజు పోటీ పరీక్షల్లో రాణిస్తారు !

ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు అనుకూలమైన రోజు. చుట్టాల రాక శుభ యోగం కలుగుతుంది. అన్నా తమ్ముళ్లు, అక్కాచెల్లెళ్ల తో కలిసి మెలిసి ఉంటారు. విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు శుభవార్తను అందుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. దగ్గర్లో ఉన్న దేవాలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకుంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని పోటీ పరీక్షల్లో రాణిస్తారు. మీ వాక్చాతుర్యం తో అన్ని పనులు అయిపోతాయి, అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు.

పరిహారాలుః ఈరోజు శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

 

 కర్కాటక రాశి:ఈరోజు అధిక లాభాలను పొందుతారు !

ఈరోజు బాగుంటుంది. మీ అప్పుల బాధలు తీరిపోతాయి. ధన లాభం కలుగుతుంది. పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసి మానసిక ప్రశాంతత పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం కలుగుతుంది. ఇంటికి స్థలాలను కొనుగోలు చేస్తారు. శత్రువులు కూడా మిత్రులు అయ్యే అవకాశం ఉంటుంది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల అధిక లాభాలను పొందుతారు. సమాజంలో మీరు గౌరవ మర్యాదలు పొందుతారు.

పరిహారాలుః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి

 

సింహరాశి:ఈరోజు మిశ్రమ ఫలితాలు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు చెప్పుడు మాటలు వినడం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. పెద్దవారిని గౌరవించడం , సూచనలను పాటించడం మంచిది. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సువర్ణ ఆభరణాలను కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పరుచుకుంటారు.

పరిహారాలుః శుభ ఫలితాల కోసం దత్తాత్రేయ పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి:దానధర్మాలు చేస్తారు !

ఈరోజు మాట పట్టింపు లేకుండా  ఉండడంవల్ల అంతా బాగుంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు పుణ్యనదీ స్నానం చేస్తారు. దానధర్మాలు చేస్తారు. వ్యాపార లాభాలు కలుగుతాయి. ఈరోజు పెద్ద వారి మాటలను, సూచనలను పాటిస్తారు.  ఈ రోజు ధనలాభం కలుగుతుంది. ఎదుటి వారి మాటలను పట్టించుకోకుండా ఉండడం మంచిది. వాహనాలు కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః ఈరోజు లక్ష్మీ అష్టకం పారాయణం చేసుకోండి.

 

తులారాశి:విద్యార్థులు బాగా చదువుకుంటారు !

ఈ రోజు బాగుంటుంది. ఈరోజు అందరితో కలిసి మెలిసి ఉంటారు. ఈరోజు ధన ప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టు ఉద్యోగం పర్మినెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారంలో అభివృద్ధి చెంది ధనప్రాప్తి పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు.

పరిహారాలుః ఈరోజు రామరక్షా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి:ఈరోజు మిత్రుల సహకారాన్ని పొందుతారు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. పెద్దవారు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడకుండా ఉండటం మంచిది. తక్కువగా మాట్లాడటం మంచిది. ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపార లాభాలు కలుగుతాయి. ఈరోజు విద్యార్థులు బాగా చదువుకొని పై చదువులకు ఉత్తీర్ణులు అవుతారు. తీర్థయాత్రలు చేస్తారు. ఇంతకుముందు ఉన అనారోగ్యము తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటారు. గొప్ప వ్యక్తులతో పరిచయాలు వలన లాభాలు కలుగుతాయి. మీ మిత్రుల సహకారాన్ని పొందుతారు.

పరిహారాలుః ఈ రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి శుభ ఫలితాలు వస్తాయి.

 

 ధనస్సు రాశి:తీర్థయాత్రలు చేస్తారు !

ఈ రోజు బాగుంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. నదీస్నానాలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. ఈ రోజు వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. సోదర సోదరీమణులతో చక్కగా, సంతోషంగా ఉంటారు. ఈ రోజు విద్యార్థులు బాగా చదువుకొని పోటీపరీక్షల్లో రాణిస్తారు.

పరిహారాలుః ఈరోజు లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

 

మకర రాశి:ఈరోజు మిత్ర లాభం !

ఈరోజు విలువైన వస్తువులను, విలువైన పత్రాలను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. శత్రువులు కూడా మిత్రుల అయ్యే అవకాశం ఉంటుంది. మిత్ర లాభం పొందుతారు. అప్పుల బాధలు తొలగిపోతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. ధన ప్రాప్తి పొందుతారు. వివాహాది శుభకార్యాల చర్చల విషయాలకు అనుకూలమైన రోజు. ఇంతకుముందు పోగొట్టుకున్న గౌరవాన్ని తిరిగి పొందుతారు. తీర్థయాత్ర చేస్తారు. పెద్దల అంగీకారంతో ప్రేమవివాహం ఫలిస్తుంది. గృహ స్థలాన్ని కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి:ఈరోజు ఆరోగ్యంగా ఉంటారు !

ఈ రోజంతా అనుకూలమైన రోజు. ఈరోజు కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. వివాహాది సంబంధ విషయ చర్చలకు అనుకూలమైన రోజు. ఇంత ముందు ఉన్న అనారోగ్యం తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు. స్థిరాస్తిలు కొనుగోలు చేస్తారు. ఈరోజు విద్యార్థులు బాగా చదువుకొని పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉద్యోగ అవకాశాలను పొందుతారు. దంపతులు అన్యోన్యంగా ఉంటారు. వ్యాపార లాభాలు కలుగుతాయి.

పరిహారాలుః ఈరోజు బ్రమరాంబికాష్టకం పారాయణం చేసుకోండి.

 

మీన రాశి:ఈరోజు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు !

ఇంతకుముందు పోగొట్టుకున్న డబ్బును, విలువైన వస్తువులను ఈరోజు తిరిగి పొందుతారు. వ్యాపార లాభాలు కలుగుతాయి. ధన ప్రాప్తి పొందుతారు. ఇంతకుముందు ఉన్న గొడవలన్నీ ఈరోజు తొలగిపోతాయి. వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవం, ఆదరణ పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. ఉద్యోగస్తులు ఆఫీసులలో పై అధికారుల ఆదరణ పొందుతారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎవరికైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. అప్పుల బాధలు తీరిపోతాయి. ఈరోజు ఆరోగ్య విషయంలో బాగుంటారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు.

పరిహారాలుః ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.