జనవరి 14 గురువారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

జనవరి – 14 – పుష్యమాసం – గురువారం.

సంక్రాంతి. ఈరోజు ఉత్తరాయణ పుణ్యాకాలం. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈరోజు సూర్యారాధన, విష్ణు ఆరాదన చేయండ. దీంతోపాటు పేదలకు, పనివారికి, గంగిరెద్దులు ఇతర తదితరులకు దానధర్మాలు చేయండి. అన్ని రాశులకు ఇదే ఉత్తమ పరిహారం. ఈరోజు భగవతుండి ఆరాధనతోపాటు ప్రకృతి ఆరాధన చేయండి. దీనివల్ల మీకు అన్నిరకాలుగా మంచి ఫలితం వస్తుంది.

 

todays horoscope

మేష రాశి:ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగలాభం !

ఈరోజు బాగుంటుంది. అప్పుల బాధలు తొలగిపోతాయి. బాకీలు వసూలు చేసుకుని ఆర్థిక లాభం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం కలుగుతుంది. వ్యాపారాభివృద్ధి పెరిగి లాభాలు పొందుతారు. ఈరోజు ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందుతారు. వాహనలు కొనుగోలు చేస్తారు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్ధికాభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు.

 

వృషభ రాశి:ఈరోజు ప్రశాంతంగా ఉంటారు !

ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది. ఖర్చులకు దూరంగా ఉండి ధన ప్రాప్తి పొందుతారు. అనుకున్న పనిని పట్టుదలతో పూర్తి చేసి కార్యసిద్ధి పొందుతారు. ఇంతకుముందు మీ మనసులో ఉన్న ఆందోళన అంతా తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. సోదరులతో కలిసి మెలిసి ఉంటారు. వ్యాపారం అభివృద్ధి చేందుతుంది.

 

మిధున రాశి:ఈరోజు కుటుంబ సభ్యులు సహాయం అందుతుంది !

ఈ రోజు బాగుంటుంది. ఈరోజు ఆరోగ్య విషయంలో బాగుంటుంది. మొండి బాకీలు ఈరోజు వసూలవుతాయి. ధన లాభం పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఆఫీసులో చాలా రోజుగా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే గనక ఈ రోజు మీకు ఎంతో మంచి రోజుగా మిగిలిపోనుంది. విద్యార్థులు బాగా చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. ఈరోజు కుటుంబ సభ్యులు సహాయం అందుతుంది.

 

కర్కాటక రాశి:ఈరోజు గొప్ప వ్యక్తులతో పరిచయాలు !

ఈరోజు శత్రువులు కూడా మిత్రులయ్యారు అవకాశం ఉంటుంది. శత్రునాశనం. ధన ప్రాప్తి పొందుతారు. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంతకుముందు ఉన్న అనారోగ్యాలన్నీ తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు. ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. గృహ స్థలాన్ని కొనుగోలు చేస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు.

 

సింహరాశి:కార్య సిద్ధి కలుగుతుంది !

ఈ రోజు బాగుంటుంది. మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అందరూ మీకు సహాయం చేస్తారు. ఎలాంటి కష్టమైన పనినైనా ధైర్యంగా శ్రమపడి పూర్తి చేస్తారు. కార్య సిద్ధి కలుగుతుంది. రోజంతా ఆరోగ్యంగా ఉంటారు. వివాహా విషయాలకు అనుకూలమైన రోజు. వ్యాపార లాభాలు కలిగి ధన ప్రాప్తి పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ  పెట్టి చదువుకుంటారు.

 

కన్యారాశి:ఈరోజు క్రొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి !

ఈరోజు కార్యసిద్ధి కలుగుతుంది. ఈరోజు అంతా బాగుంటుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. విద్యార్థులు బాగా చదువుకుని పోటీపరీక్షల్లో ఉన్నత శ్రేణి మార్కులు పొందుతారు. మీకు తెలిసిన వారిద్వారా క్రొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. సమస్త రోగ నాశనం. వ్యాపార లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. ఈరోజు మంచి ఆలోచనలతో ఉంటారు.

 

 తులారాశి:ఈరోజు అధికారుల నుంచి  కీర్తిని పొందుతారు !

ఈరోజు శుభయోగం. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. ధన ప్రాప్తి పొందుతారు. వాహన కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయడం మంచిది, చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది.బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు పెట్టడం వల లాభాలు కలుగుతాయి. అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటారు. యాత్రలు చేస్తారు. ఉద్యోగస్తులు ఆఫీసులలో పై అధికారుల నుంచి  కీర్తిని పొందుతారు.

 

వృశ్చిక రాశి:వివాదాలు నుంచి బయట పడతారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. రున బాధలు తీరిపోతాయి. శత్రువులకు దూరంగా ఉంటారు. మిత్ర లాభం పొందుతారు. ఈరోజు కుటుంబ సభ్యులతో , స్నేహితులతో సంతోషంగా ఉంటారు. ఇంతకు ముందు ఎవరితో అయినా వివాదాలు పడిన ఈ రోజు వాటి నుంచి బయట పడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. సకాలంలో నిద్రాహారాలు తీసుకుని ఆరోగ్యంగా ఉంటారు. విద్యార్థులు బాగా చదువుకొని విద్యా లాభం పొందుతారు. దేవాలయ దర్శనం చేసుకుంటారు. వ్యాపార లాభాలు పొందుతారు.

 

 ధనస్సు రాశి:ఈరోజు శత్రువులు మిత్రులు అవుతారు !

ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది. ఎవరితో అయినా బాగా మాట్లాడుతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. మీ గృహంలో శుభకార్యం తలపెడతారు. ఉద్యోగం అనుకున్న స్థానాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. ఈరోజు శత్రువులు కూడా మిత్రులు అవుతారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

 

మకర రాశి:ఈరోజు మాట నిలబెట్టుకుంటారు !

ఈరోజు బాగుంటుంది. ధన వృద్ధి కలుగుతుంది. మీ ఇంట్లో ఏదో ఒక శుభకార్యం చేయడానికి అనుకూలిస్తాయి. మిత్రలాభం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం పొందుతారు. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు.

 

కుంభరాశి:వ్యాపార లాభాలు కలుగుతాయి !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. వృత్తిపరమైన అంకితభావం మీకు ప్రశంసలు తెచ్చిపెడుతుంది. ఉద్యోగస్తులకు వారు కోరుకున్న ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపార లాభాలు కలుగుతాయి. మీ పిల్లల విషయంలో శుభవార్త వింటారు.

 

మీన రాశి:ఈరోజు నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది !

ఈరోజు ఏ పని చేసిన మీకు కలిసి వస్తుంది. ఏ పని చేసిన ఆదరణ పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి, ప్రయాణం వెంటనే ఫలితాలను తీసుకుని రాదు, కానీ భవిష్యత్ ప్రయోజనాలకు పునాది వేస్తుంది.  విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధించి ఉన్నత శ్రేణి మార్కులు పొందుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. అయిన వారితో, బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది.