మేషరాశి : జీవితంపట్ల ఉదార ఉదాత్తమైఅ ధోరణిని పెంపొందించుకొండి. ఉమ్మడి వ్యాపారాలలోను, ఊహల ఆధారితమైన పథకాలలోను పెట్టుబడి పెట్టకండి. మీ కుటుంబ సభ్యులు గోరంతను కొండంతలు చేయవచ్చు. ప్రేమైక జీవితం బహు హుషారుగా వైబ్రంట్‌గా ఉంటుంది. వివాదాలు, ఆఫీసు రాజకీయాల వంటివాటిని మర్చిపోండి. ఈ రోజు ఆఫీసులో మీదే రాజ్యం. మీ బెటర్ హాఫ్ తో రొమాన్స్ చేసేందుకు ఇది చక్కని రోజు.
చికిత్స :- ఆవ నూనెలో మీ ముఖం ప్రతిబింబం చూడండి, అదే ఆవాల నూనెలో పిండితో చేసిన తీపి వంటకాలను పక్షులను తినిపించండి. ఇది ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది
వృషభరాశి : మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై దృష్టి పెట్టడంతో ప్రయోజనకరమైన రోజు. దీర్ఘ కాలిక మైన మదుపులతో, తగినంత లాభాలను పొందుతారు. సముద్రాల అవతల ఉండే బంధువు ఇచ్చే బహుమతితో మీకు చాలా సంతోషం కలుగుతుంది. మీ లవర్ తో బయటకు వెళ్ళినప్పుడు, మీ ఆహార్యంలో, ప్రవర్తనలో, సహజంగా ఉండండి. పనిలో మీ సీనియర్లు ఈ రోజు అద్భుతంగా కన్పిస్తున్నట్టుగా ఉంటుంది.
చికిత్స :- వ్యాపారం, వృత్తిలో విజయవంతం కావడానికి జేబులో లేదా వాలెట్లో సీసపు ముక్కని ఉంచండి.
మిథునరాశి : మిమ్మల్ని ప్రశాంతంగా, కూల్‌గా ఉంచగల పనులలో నిమగ్నమవండి. ఆర్థిక సమస్యలు మీ నిర్మాణాతకంగా ఆలోచించే సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకొండి. కష్టపడి పని చెయ్యడం మరియు ఓర్పు వహించడం ద్వారా, మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆతరువాత మీరు జీవితంలో పశ్చాత్తప పడవలసి వస్తుంది పక్కా అల్లరిచిల్లర చేష్టలతో మీ టీనేజీ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేయనుందీ రోజు.
చికిత్స :- మంచి ఆదాయాన్ని సాధించడానికి, మీ ఇంటిలోనే వెండి నాణెంను గంగాజలం లో ఉంచండి
కర్కాటకరాశి : గ్రహరీత్యా, మీకు ఒళ్ళునొప్పులబాధ కనిపిస్తోంది. శారీరక అలసటను తప్పించుకొండి. అదిమీకు మరింత వత్తిడిని పెంచుతుంది. తగిన విశ్రాంతిని తీసుకోవాలని గుర్తుంచుకొండి. మీ ఖర్చులను అదుపు చెయ్యండి. ఈ రోజు ఖర్చులలో మరీ విలాసాలకు ఎక్కువ ఖర్చుఅయిపోకుండా చూసుకొండి. మీ ప్రియమైన వారికి ఈ ప్రపంచం ఒక చక్కని నివాస యోగ్యంగా చేసేది, మీ సాన్నిధ్యమే. క్రొత్తగా ఉమ్మడి వెంచర్లు మరియు భాగస్వామ్య వ్యాపార పత్రాలపై సంతకాలకు దూరంగా ఉండండి. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్దమనిషి, మీకు మార్గ దర్శనం చేసే రోజు. ఈ రోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది.
చికిత్స : హనుమాన్ చాలిసా పఠనం ఆరోగ్యానికి మంచి ఫలితాన్నిస్తుంది.
సింహరాశి : చాలాకాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు. అనుకోని వనరులద్వారా వచ్చే ధనలాభాలు, రోజుని కాంతివంతం చేస్తాయి. ఇతరుల ధ్యాసను పెద్దగా కష్ట పడకుండానే, ఆకర్షించడానికి ఈరోజు సరియైనది. ఎప్పుడూ వెలుగుదిశగా చూడండి, మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది. ప్రయాణం ప్లాన్లు ఏవైనా ఉంటే, అవి వాయిదా పడతాయి. అది మీ పథకంలో ఆఖరు నిముషంలో వచ్చిన మార్పులవలన జరుగుతుంది. మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నదీ తనకు తెలిసేలా చెప్పండి.
చికిత్స: లాభదాయకమైన వృత్తి జీవితాన్ని ఆస్వాదించడానికి, స్వదేశీ ఆవులకు ఆకుపచ్చ ఆకు కూరని ఇవ్వండి.
కన్యారాశి : అనవసరమయిన విషయాలను వాదిస్తూ మీ శక్తిని వృధా చేసుకోకండి. వాదన వలన ఎప్పుడైనా ఒరిగేదేమీ లేదని, పైగా నష్టపోయేది ఉందని గుర్తుంచుకొండి. దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం, స్టాక్, మ్యూచ్యువల్ ఫండ్‌ల్లో మదుపు చెయ్యాలి. మీ వ్యక్తిగత సంబంధమైన విషయాలలో ఒక ముఖ్యమైన అభివృద్ధి కానవస్తుంది. అది, మీకు, మీకుటుంబానికి కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది. వ్యాపార భాగస్థులు సహకరిస్తారు, అలాగే మీరు వారితోకలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తిచెయ్యడానికి పనిచెయ్యండి. ఇతరులకు ఉపకరించడంలో మీసమయాన్ని శక్తిని అంకితం చెయ్యండి- అంతేకానీ, మీకు ఏవిధంగానూ సంబంధించని వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండీ. ఈ రోజు మీ జీవిత భాగస్వామి పెట్టే ఇబ్బంది వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది.
చికిత్స :- అద్భుతమైన ఆరోగ్యం కోసం పనివారికి కాయధాన్యాలు (కంది పప్పు) దానం లేదా ఏ ఇతర మార్గం లో అయినా వారికి సహాయం చేయండి.
తులారాశి : జీవితాన్ని అనుభవించడానికి మీ ఆకాంక్షలను చెక్ చేసుకొండి. భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంచి మీ స్వభావాన్ని మెరుగుపరిచేది, జీవించగలిగే కళను నేర్పేది అయిన యోగా సహాయం పొందండి. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయి. సామాజిక ఫంక్షన్లు, పార్టీలకు హాజరయితే, మీ స్నేహ వర్గం, పరిచయస్థులు, పరిధిని పెంచు కుంటారు. పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు అంకితభావంకల ఉద్యోగులకు లభిస్తాయి. మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు తెచ్చిపెట్టేందుకు ఎవరో ప్రయత్నించవచ్చు. కానీ మీరిద్దరూ ఏదోలా సర్దుబాటు చేసుకుంటారు.
చికిత్స :- ఒక మంచి ప్రేమ జీవితం కోసం, వెండి ఏనుగును మీ ప్రేమికులకు బహుమతిగా ఇవ్వండి .
వృశ్చికరాశి : కొంతమంది, మీరు వయసుమీరారు కనుక క్రొత్తవి ఏవీ నేర్చుకోలేరని అనుకుంటారు, కానీ అది సత్యదూరం. కుటుంబ సమస్య పరిష్కారమే ప్రాధాన్యతగా ఉండాలి. మీరు ఆలస్యం చెయ్యకుండా వెంటనే చర్చించవలసి ఉన్నది. ఎందుకంటే ఒకసారి ఇది పరిష్కరింపబడితే- ఇంట్లో హాయిగా సాఫీగా జీవితం గడిచిపోతుంది. ఇంకా మీ కుటుంబ సభ్యులను సులువుగా ప్రభావితం చెయ్యగలుగుతారు. మీకు బాగా ఇష్టమైన వారినుండి కానుకలు, బహుమతులు అందుకుంటారు. మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉన్నది. ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని, ముందుకు సాగిపొండి. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలూ చేస్తారు.
చికిత్స :- మంచి ఆర్థిక పరిస్థితుల కోసం మీ తండ్రి లేదా తండ్రి వంటి వారికి బెల్లం, గోధుమ, కుంకుమ వంటి ఆహార ఉత్పత్తులను ఇవ్వండి.
ధనస్సురాశి : అనవసరంగా మిమ్మల్ని మీరు తిట్టుకుంటే అది మీకు నిరాశ కలిగించగలదు. కొంతమందికి ప్రయాణం బాగా త్రిప్పట మాత్రమే కాక వత్తిడిని కూడా కలిగిస్తుంది- కానీ ఆర్థికంగా కలిసి వచ్చేదే. అందరినీ ఒకచోట చేర్చిఒకే లక్ష్యం కోసం పనిచేసేలాగ టీమ్ వర్క్ చేయడానికిగాను, శక్తివంతమైన స్థానంలో ఉంటారు మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈ రోజు ఎంతగానో మిస్ కానున్నారు. కాబట్టి ఒక మంచి సర్ ప్రైజ్ ను ప్లాన్ చేయండి. తద్వారా ఈ రోజును మీ జీవితంలోకెల్లా అందమైన రోజుగా మలచుకోండి. పనిలో నెమ్మదిగా వచ్చే అభివృద్ధి తక్కువ టెన్షన్ లని కలిగిస్తుంది. పెండింగ్‌లో గల సమస్యలు త్వరలో పరిష్కరించబడాల్సి ఉన్నది, పైగా ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి, అందుకే, సానుకూలంగా స్పందించండి, మీ శ్రమను ఈరోజే మొదలు పెట్టండి. ఈ రోజు ప్రపంచమంతా మునిగిపోవచ్చు గాక. కానీ మీరు మాత్రం మీ జీవిత భాగస్వామి చేతుల్లోంచి బయటపడాలని అస్సలు అనుకోరు.
చికిత్స :- వృత్తి జీవితంలో ఐదు నక్షత్రాల స్థానం కోసం జేబులో ఒక రాగి నాణెం ఉంచండి.
మకరరాశి : ఈరోజు పాత నిర్ణయాలు మిమ్మల్ని నిరాశకు గురిచేస్తాయి, మానసికంగా తుఫాను తెస్తాయి. ఇక మీరు అసలు ఇంక ఏమిచెయ్యాలో తెలీని అయోమయంలో పడిపోతారు, ఇతరుల సహాయం తీసుకొండి. మీరు డబ్బును సంపాదించినా కూడా పెరిన ఖర్చులవలన దాచుకోలేకపోతారు. ఈరోజు ప్రయాణాలు కేవలం మానసిక ఆందోళనకు మరియు వత్తిడికి కారణమవుతాయి కనుక మానండి. ఆఫీసులో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు. ప్రయాణం ప్లాన్లు ఏవైనా ఉంటే, అవి వాయిదా పడతాయి. అది మీ పథకంలో ఆఖరు నిముషంలో వచ్చిన మార్పులవలన జరుగుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు.
చికిత్స :- మంచి ఆరోగ్యం కోసం పరమశివుడిని పూజించండి.
కుంభరాశి : మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కానీ అతిగా తినడం, మత్తు కలిగించే హార్డ్ డ్రింకులను తీసుకోవడానికి కూడా దారితీయవచ్చును, జాగ్రత్త వహించండి. ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి, మరియు అత్యద్భుతమయిన లాభాలను తెచ్చి పెడతాయి. ఇంటి పనులలో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకొండి. అదేసమయంలో కొంచెం సేపు వినోదానికి కూడా కేటాయించండి. అది మీకు మనసు శరీరాలకు రెండింటికీ రీ ఛార్జ్ అయి, చురుకుగా ఉండే శక్తినిస్తుంది. మీ స్వీట్ హార్ట్ కి మీ భావనను ఈరోజే అందచేయాలి, రేపు అయితే ఆలస్యం అయిపోతుంది. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి, సృజనాత్మకత గల ప్రాజెక్ట్ లగురించి పనిచెయ్యడానికి కూడా, ఇది మంచి సమయం. వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపడం ఎంత బాగుంటుందో ఈ రోజు మీకు తెలుస్తుంది.
చికిత్స :- నిరంతర మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మినుమలు, శెనగలు, నల్లటి దుస్తులు, ఆవ నూనె దానం చేయండి
మీనరాశి : నాయకత్వ లక్షణసారం అనేది అంతా, ఆత్మ విశ్వాసంలో ఉంటుందని గుర్తించండి. ఎందుకంటే మీరు మీ అనారోగ్యంతో దీర్ఘకాలంగా పోరాడుతున్నారు. మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి, అది మీకు నమ్మకమైన రీతిలో అధికమొత్తాలను రాబోయే రోజులలో తెచ్చిపెడుతుంది. మీ తల్లిదండ్రులతో మీ సంతోషాన్ని పంచుకొండి. వారినికూడా విలువగలవారిగా భావించనివ్వండి. మరి వారికి ఒంటరితనం భావన, నిస్పృహలు ఆవరించి ఉన్నచి, కాస్తా తొలగించబడతాయి. ఒకరికొకరు జీవితాన్ని తేలిక పడేలాగ చేసుకోకపోతే, జీవితానికి అర్థం ఏమున్నది. ప్రేమలో వేగంగా కాకపోయినా, నెమ్మదిగా జ్వలిస్తారు. సంతృప్తికరమైన ఫలితాలకోసం చక్కగా ప్లాన్ చేసుకొండి. ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు, మీ అంచనాకు మించి, లబ్దిని చేకురుస్తాయి. పెళ్లంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు. కాస్త సమయాన్ని మీ జీవిత భాగస్వామి తో కలిసి గడపడం చాలా ముఖ్యం.
చికిత్స :- వృద్ధులకు, సీనియర్లకు, గౌరవకు గురువులు, ఉపాధ్యాయులు, పండితులను గౌరవించండి మంచి ఆరోగ్యాన్నీ పొందండి
– కేశవ