నిరుద్యోగకు శుభవార్త : 84 వేల పారామిలటరీ ఉద్యోగాలు..!

-

నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త. పారామిలటరీ బలగాల్లో దాదాపుగా 84వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర సాయుధ బలగాల్లో (సీఏపీఎఫ్) 9,99,795 పోస్టులు మంజూరు అయ్యాయని, ఏటా వివిధ గ్రేడుల్లో 10 శాతం వరకు ఖాళీలు ఏర్పడుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ప్రస్తుతం 84,037 పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర హోం శాఖ మంగళవారం లోక్‌సభలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో తెలియజేసింది.

కాగా సీఆర్‌పీఎఫ్‌లో 22,980 ఖాళీలు, బీఎస్‌ఎఫ్‌లో 21,465, సీఐఎస్‌ఎఫ్‌లో 10,415, ఎస్‌ఎస్‌బీలో 18,102, ఐటీబీపీలో 6643, అస్సాం రైఫిల్స్‌లో 4432 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర హోం శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే నూతనంగా ఏర్పడిన పోస్టులతోపాటు అటు ఖాళీగా ఉన్న పోస్టులను కూడా త్వరలో భర్తీ చేస్తామని కేంద్రం తెలిపింది. అందులో భాగంగానే రిక్రూట్‌మెంట్ నిబంధనలకు అనుగుణంగా ఈ పోస్టులను నియామకాలు, పదోన్నతులు, డిప్యుటేషన్‌ల ద్వారా భర్తీ చేస్తామని కేంద్రం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news