మార్చి 02 మంగళవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

మార్చి –  02- మాఘ మాసం – మంగళవారం.

 

మేష రాశి:ప్రయాణాలు అనుకూలిస్తాయి !

ఈ రోజు బాగుంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. గతంలో పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సోదరులతో సఖ్యతగా ఉంటారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు.

పరిహారాలు: ఈరోజు జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని ఆరాధించండి.

 

todays horoscope

వృషభ రాశి:విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు !

ఈ రోజు సంతోషకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సఖ్యతగా ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ ఉద్యోగం అవుతుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. వాహనాలను కొనుగోలు చేస్తారు. స్థల కొనుగోలు చేస్తారు. చేపట్టిన ప్రతి పనిని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు

పరిహారాలు: ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

 

మిధున రాశి:వ్యాపారాల్లో లాభాలు  !

ఈ రోజు బాగుంటుంది. వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. దంపతులిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు, కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. రుణ బాధలు తీరిపోతాయి. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన యోగం కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఇతరులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ముఖ్యమైన పనుల్లో స్నేహితుల సహకారం పొందుతారు. మిత్ర లాభం కలుగుతుంది.

పరిహారాలు: ఈరోజు షట్పది స్తోత్రం పారాయణం చేసుకొంది.

 

కర్కాటక రాశి:ఆరోగ్యంగా ఉంటారు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. చేపట్టిన ప్రతి పనిలో ఆదరణ పొందుతారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ఉన్నత పదవులను పొందుతారు. మీ మాట తీరు వల్ల అందరి ఆదరణ పొందుతారు. ఇంతకుముందు ఉన్న అనారోగ్యాలను తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపార భాగస్వాముల వల్ల లాభాలు. విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

పరిహారాలు: శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించండి.

 

సింహరాశి:కష్టపడి చదువుకుంటారు !

ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. మీ మాట తీరు బాగుంటే అంతా బాగుంటుంది. సోదరులతో కలిసి మెలిసి ఉంటారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పై అధికారుల ఆదరణ పొందుతారు. గృహంలో శుభకార్యాన్ని తలపెడతారు. విద్యార్థుల బాగా కష్టపడి చదువుకుంటారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

పరిహారాలు: ఈరోజు శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి:పోగొట్టుకున్న వస్తువులని తిరిగి పొందుతారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. వ్యాపారంలో లాభాలు. గతంలో పోగొట్టుకున్న వస్తువులని తిరిగి పొందుతారు. ప్రయాణాలు కలిసొస్తాయి.

పరిహారాలు: లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

 

తులారాశి:వ్యాపారాల్లో స్వల్ప లాభాలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఒడిదుడుకులు ఎదురౌతాయి. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ వహించడం మంచిది. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి. రుణ బాధలు పెరుగుతాయి. ప్రాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది.

పరిహారాలు: కనకధారా స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి:రుణ బాధలు తీరిపోతాయి !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. గతంలో ఉన్న సమస్యలు తగ్గిపోతాయి. ప్రశాంతంగా ఉంటారు. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉంటారు. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. రుణ బాధలు తీరిపోతాయి. ఆర్థిక లాభం కలుగుతుంది. నూతన వ్యాపారాల ప్రారంభానికి అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు.

పరిహారాలు: కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

 

ధనస్సు రాశి:కార్యాలయాల్లో పదోన్నతలు పొందుతారు !

ఈ రోజు బాగుంటుంది. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. వ్యాపార లాభాలు అనుకూలిస్తాయి. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతలు పొందుతారు. ప్రయాణ లాభం కలుగుతుంది. అయిన వారి ఆదరణ పొందుతారు. అప్పుల బాధలు తీరిపోతాయి. ధన యోగం కలుగుతుంది. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు.

పరిహారాలు: ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

మకర రాశి:సంగీత సాహిత్యానికి ఆసక్తి చూపుతారు !

ఈరోజు ఆనందకరంగా వుంటుంది. సంగీత సాహిత్యానికి ఆసక్తి చూపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు మార్పిడి అవుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

పరిహారాలు: ఈరోజు శ్రీ దక్షిణామూర్తి స్వామిని ఆరాధించండి.

 

కుంభరాశి:పోటీ పరీక్షల్లో విజయం !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. అందరితో సఖ్యత గా ఉంటారు. అనారోగ్య సమస్యలను పోగొట్టుకొని ఆరోగ్యంగా ఉంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. సమయానికి డబ్బులు అందుతాయి.ధన లాభం కలుగుతుంది.

పరిహారాలు: ఈరోజు శ్రీ అన్నపూర్ణా దేవిని ఆరాధించండి.

 

మీన రాశి:దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు !

ఈరోజు బాగుంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు, ఉత్తమ విద్యార్థులు గా పేరుప్రఖ్యాతులు పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పై అధికారుల మన్ననలు పొందుతారు. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. రుణ బాధలు తీరిపోతాయి. ధనప్రాప్తి కలుగుతుంది.

పరిహారాలు: మీనాక్షి అమ్మవారిని ఆరాధించండి.

 

Read more RELATED
Recommended to you

Latest news