ఫార్మా కంపెనీ పై ఐటీ దాడులు..ఏకకాలంలో ఐదు రాష్ట్రాల్లో !

-

హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఫార్మా కంపెనీ పై ఐటీ దాడులు కలకలం రేపాయి. నిన్న పొద్దుపోయాక ఐదు రాష్ట్రాల్లో ఏకకాలంలో ఐటీ శాఖ దాడులు నిర్వహించినట్లు చెబుతున్నారు. ఇక సదరు ఫార్మా కంపెనీ ఉత్పత్తి చేస్తున్న మందులు ఎక్కువ శాతం అమెరికా యూకే తరలిస్తున్నట్టు గుర్తించారు. కంపెనీ ఆదాయం మొత్తాన్ని పక్కదారి పట్టిన యజమాన్యం, మొత్తం 400 కోట్ల రూపాయల వరకూ ధనాన్ని పక్కదారి పట్టించినట్టు ఐటీ శాఖ గుర్తించినట్లు చెబుతున్నారు.

కంపెనీ నిధులతో పెద్ద మొత్తంలో ఆస్తులను కూడబెట్టిన యాజమాన్యం, పలు రాష్ట్రాల్లో వ్యక్తిగతంగా కంపెనీ డబ్బులతో యజమాన్యం ఆస్తులు కొనుగోలు చేసినట్టు కూడా గుర్తించారు. 350 కోట్ల రూపాయల కోట్ల రూపాయల నిధులకి సంబంధించిన అంశం మీద ఐటీ దాడులు జరిగాయాని అంటున్నారు. ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో భూమి పత్రాలతో పాటు పెన్ డ్రైవ్ లు  హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకోగా రెండు కోట్ల రూపాయల లోపు నగదు కూడా స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news