మార్చి 3 మీన రాశి మంగళవారం : ఈరాశి వారికి అనుకూల ఫలితాలు !

-

మీన రాశి : ఈరోజు ఈరాశిలో ఉన్నవారికి వారి సంతానము వలన ఆర్థికప్రయోజనాలు పొందుతారు. మీ సంతానమును చూసి మీరు గర్వపడతారు. మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. మీ మనసు, ఈమధ్యన జరిగిన కొన్ని విషయాల వలన, కలతపడి ఉంటుంది.

ధ్యానం, యోగా ఆధ్యాత్మికంగాను, శారీరకంగాను ప్రయోజన కరం కాగలవు. క్రొత్తవి నేర్చుకోవాలన్న మీ దృక్పథం బహు గొప్పది. షాపింగ్ కి వెళ్ళినప్పుడు దుబారా ఖర్చులు మానండి. ఈ రోజు మీ తీరిక లేని షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి తననుతాను అప్రధానంగా భావించుకోవచ్చు. దాంతో ఆ అసంతుష్టిని సాయంత్రమో, రాత్రి పూటో తన ప్రవర్తన ద్వారా చూపించవచ్చు.
పరిహారాలుః మంగళ గౌరీ దేవిని పసుపు, కుంకుమలతో ఆరాధిస్తే అనుకూల ఫలితాలు వస్తాయి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version