ఈ రాశుల వారికి అనుకున్న ఫలితాలు అందుతాయి..

ఒక్కో రోజు ఒక్కో రాశుల వారికి మంచి ఫలితాలు ఉంటాయి. మరి ఈరోజు ఏ రాశుల వారికి అనుకున్న పనులు పూర్తి అవుతాయో ఇప్పుడు చూద్దాం..

horoscope

మేషం: పాత బాకీలు వసూలవుతాయి. ఆప్తులు, బంధువులతో వివాదాలు తీరతాయి. అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు..ఈరోజు వీరికి చాలా మంచి రోజు..

వృషభం: పనుల్లో ఆలస్యం.అనుకున్న పనులు త్వరగా పూర్తీ కావు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వచ్చే లాభాలా కన్నా కూడా పని ఎక్కువగా ఉంటుంది. దూరప్రయాణాలు చికాకు తెప్పిస్తాయి. అనారోగ్యం. దైవచింతన. వ్యాపారాలలో ఆటంకాలు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి..

మిథునం: చిన్ననాటి మిత్రుల కలుసుకుంటారు.. విందువినోదాలు. పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వస్తులాభాలు అధికం.. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఎదురవుతాయి.

కర్కాటకం: ఆర్థిక ఇబ్బందులు కొంత మేర ఇబ్బందులు కలుగుతాయి..కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విభేదాలు కలుగుతాయి. ప్రయాణాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా సాగుతాయి…ఈరోజు వీరికి అస్సలు బాగాలేదని అంటున్నారు.

సింహం: ప్రముఖుల నుంచి శుభవార్తలు వింటారు.. వాహనయోగం. చిన్ననాటి మిత్రుల తో సంతోషంగా గడుపుతారు. విందువినోదాలలో పాల్గొంటారు.. వ్యవహారాలలో పురోభివృద్ధి. ఉద్యోగయోగం. వ్యాపారాలలో లాభాలు కలుగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం కలుగుతుంది.

కన్య: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది.. ఆర్థికాభివృద్ధి. వాహనయోగం జరుగుతుంది. కొన్ని వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

తుల: కుటుంబసభ్యులతో వైరం.. చికాకులు ఆకస్మిక ప్రయాణాలు. బంధువులను కలుసుకుంటారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యం కొంత క్షీణిస్తుంది. వ్యాపారాలలో ఆకస్మిక చికాకులు. ఉద్యోగాలలో మార్పులు బాధిస్తాయి.

వృశ్చికం: ఉద్యోగయత్నాలు నిరాశను కలిగిస్తాయి. ముఖ్యమైన పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలిగిస్తుంది. వ్యయప్రయాసలు, ఆరోగ్యసమస్యలు తలేత్తుతాయి..వ్యాపారాలలో లాభాలు రావు. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు పెరుగుతాయి.

ధనుస్సు: నిరుద్యోగులకు ఉద్యోగలాభం మెండుగా ఉంది. పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల సలహాలు, సూచనలు పాటిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. దైవదర్శనాలు,వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో కీలక మార్పులు జరుగుతాయి.. ఈరోజు వీరికి చాలా మంచి రోజు.

మకరం: ప్రముఖుల సహకారాలు అందుతాయి. ఆర్థికంగా బలపడతారు. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. శుభవార్తలు వింటారు. వాహనయోగం,విద్యావకాశాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో శుభవార్తలు వింటారు.

కుంభం: ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలగవచ్చు.. ధనవ్యయం,అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొంత గందరగోళం ఏర్పడుతుంది..

మీనం: మిత్రులతో కలహాలు కలుగుతాయి.. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. అనుకోని ప్రయాణాలు,దైవదర్శనాలు,అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి.పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలలో ఇబ్బందులు. ఉద్యోగాలలో కొత్త సమస్యలు కలగుతాయి..ఈరోజు వీరికి నిరాశ ఎదురవుతుంది..