నవంబర్ 19 గురువారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

 

నవంబర్‌ – 19- గురువారం. కార్తీకమాసం.

 

మేషరాశి:ఈరోజు మిశ్రమఫలితాలు అందుకుంటారు !

మీపై అధికారిని కలవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. నూతన సంబంధం ద్వారా అదృష్టం కలిసి వస్తుంది. ఈరాశి వారు ఈ రోజు మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. సమాజంలో గౌరవంతో పాటు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. స్నేహితులతో సుదీర్ఘ పర్యటనలకు వెళ్లవచ్చు. మీ వివాహ జీవితంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి. ప్రయాణాలు కలసివస్తాయి.

పరిహారాలుః తేనేతో శివాభిషేకం చేయించండి. అనుకూల ఫలితాలు వస్తాయి.

todays horoscope

వృషభరాశి:ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు !

 

ఈరోజు మిశ్రమఫలితాలు, వ్యాపారులు బాగా శ్రమించాలి. ప్రభుత్వ ఉద్యోగి అయితే మీ సీనియర్ అధికారులు మీపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఈరోజు సామాజిక సంబంధాలు ప్రయోజనకరంగా ఉంటాయి. నూతన ప్రణాళికపై దృష్టి పెట్టండి. ఈ రోజు మీకు ఆకస్మిక ప్రయోజనాలు ఉండవచ్చు. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది.

పరిహారాలుః శివ అష్టోతరంతో పూజ చేయండి.

 

మిథునరాశి:ఈరోజు లాభాలు రావచ్చు !

ఈరోజు ఉద్యోగంలో సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారం లో అనుకోని లాభాలు వస్తాయి. ఈ రోజు మొదటి అర్ధభాగంలో లాభం వచ్చే అవకాశముంది.  రాత్రి సమయంలో స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య సరదాగా సమయాన్ని గడుపుతారు. ఈ రోజు వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః శ్రీలలితాదేవి ఆరాధన చేయండి.

 

​కర్కాటకరాశి:ఈరోజు సంతానం వల్ల సంతోషం !

ఈరాశి వారికి ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఈరోజు మీశ్రమ భవిష్యత్‌కు పునాది అవుతుంది. సంతానం వల్ల సంతోషం లభిస్తుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. వైవాహిక జీవితం అత్యంత సాధారణంగా ఉంటుంది.

పరిహారాలుః శ్రీగురుచరిత్రను పారాయణం చేయండి.

 

​సింహరాశి:ఈరోజు విజయాలను అందుకుంటారు !

ఈరోజు మిశ్రమఫలితాలు. ఈరోజు అనవసరమైన ఇబ్బందులు. కోపతాపాలకు దూరంగా ఉండండి. కష్టపడి పనిచేయడం వల్ల విజయాలు అందుకుంటారు. ఈ రోజు మీకు తెలియని వ్యక్తితో ఎటువంటి లావాదేవీలు జరపవద్దు. లేకపోతే నష్టం వాటిల్లవచ్చు. వైవాహికంగా సాధారణంగా ఉంటుంది.

పరిహారాలుః అరోగ్యం మంచిగా ఉండటానికి శ్రీసూక్తపారాయణం చేయండి.

 

​కన్యరాశి:ఈరోజు సృజనాత్మకంగా ఆలోచించండి !

ఈరోజు కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. సృజనాత్మకంగా ఆలోచనలు చేయండి. కోపాన్ని నియంత్రించుకోవాలి. ఇంటి సమస్యలను పరిష్కారం అవుతుంది. ఈరోజు ఆకస్మిక ప్రయోజనాలు పొందుతారు. ఈ రోజు మీకు పరిశ్రమలో సంసిద్ధత వల్ల ప్రయోజనం ఉంటుంది. వైవాహికంగా సాధారణంగా ఉంటుంది.

పరిహారాలుః బాబా దేవాలయంలో దానం, ధర్మం చేయండి.

 

​తులరాశి:ఈరోజు అనుకోని సమస్యలు !

ఈరోజు అనుకోని సమస్యలు. వీటికి తగిన పరిష్కారాలు లేకపోవడం వల్ల మానసిక క్షోభ కలుగుతుంది. వాణిజ్య విషయంలో ప్రతికూలత. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ చివరకు అనుకున్నది సాధిస్తారు. వైవాహికంగా సాధారణంగా ఉంటుంది.

పరిహారాలుః పేదలకు వస్త్రాలు లేదా ఆర్థికసహాయం చేయండి. అనుకూల ఫలితాలు వస్తాయి.

 

​వృశ్చికరాశి:ఈరోజు నెగెటివ్‌ ఆలోచనలకు దూరంగా ఉండండి !

ఈరోజు అనుకోకుండా దూర ప్రయణాలు చేసే అవకాశముంది. నెగెటివ్‌ ఆలోచనలకు దూరంగా ఉండండి. సంతానం నుంచి శుభవార్త అందుకుంటారు. అనవసర ఖర్చులు నివారించండి. ఈరాశి వారికి ఈ రోజు గందరగోళంగా ఉంటుంది. మీ అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వైవాహికంగా సాఫీ జీవితం ఉంటుంది.

పరిహారాలుః పంచామృతాలతో శివాభిషేకం చేయండి.

 

​ధనస్సురాశి:ఈరోజు బాకీలు వసూలు అవుతాయి !

ఈరోజు బాకీలు వసూలు అవుతాయి. ఈ రోజు ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల వైపు ఆసక్తి చూపిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను తెస్తాయి. అనుకోని ప్రయాణం. ఆరోగ్యం బాగుంటుంది. నూతన వ్యక్తులతో పరిచయం మీకు కలిసి వస్తుంది. ఈ రోజు మీ వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది.

పరిహారాలుః శ్రీశివారాధన అత్యంత మంచి ఫలితాన్నిస్తుంది.

 

​మకరరాశి:ఈరోజు ఆనందంగా ఉంటారు !

ఈరోజు అనుకూల ఫలతాలు. మీ శక్తి పెరగడం వల్ల శత్రువుల బాధ విరుగడవుతుంది. ఇంటికి అకస్మాత్తుగా అతిథులు వచ్చే అవకాశముంది. ఫలితంగా ఖర్చులు పెరుగుతాయి. దంపతులు వారి వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది.

పరిహారాలుః నవగ్రహాలకు సంబంధించిన స్తోత్రం పారాయణం చేయండి.

 

​​కుంభరాశి:ఈరోజు విజయం సాధిస్తారు !

ఈరోజు అనుకూల ఫలితాలు. ప్రయాణం కలసి వస్తుంది. అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. వాహనాలు, భూమి కొనుగోళ్లకు అవకాశం ఉంది. ఇంట్లోకి అవసరమైన సామాన్లు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఈ రోజు వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది.

పరిహారాలుః శివాలయంలో ప్రదక్షణలు చేయండి.

 

​మీనరాశి:ఈరోజు ఆరోగ్యం జాగ్రత్త !

ఈరాశి అనుకోని సమస్యలు రావచ్చు. కానీ మీరు అధిగమిస్తారు. సంతానానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించడంలో డబ్బు ఖర్చు చేస్తారు. మీరు ఏ పోటీలోనైనా గెలవవచ్చు. ఈరోజు వచ్చే మార్పులు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. వైవాహికంగా సాధారణంగా ఉంటుంది.

పరిహారాలుః మంచి ఆరోగ్యం కోసం పరమశివుడిని ప్రార్థించండి. వీలైతే మారేడుదళాలతో శివారాధన చేయండి.

 

 శ్రీ