నవంబర్ 22 ఆదివారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

నవంబర్‌ – 22 – కార్తీకమాసం – ఆదివారం.

మేషరాశి: ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది !

మీ ఆరోగ్యంగా ఉంటారు. మీ సహచరుల నుంచి మీకు సాయం అందుతుంది. పనులు ఆలస్యం అవుతున్న ఆందోళన చెందకండి. మీరు పని చేసే వాతావరణం మెరుగుపడుతుంది. మీ చుట్టూ వాతావరణం ఆహ్లదకరంగా ఉండేలా చూసుకోండి. తొందరలోనే అన్ని సర్దుకుంటాయి. వైవాహిక జీవితంలో సాధారణ స్థితి ఉంటుంది.

పరిహారాలుః ఆదిత్య పారాయణం  చేయండి. అనుకూల ఫలితాలు వస్తాయి.

todays horoscope

వృషభరాశి: ఈరోజు కొత్త అవకాశాలు లభిస్తాయి !

కొత్త అవకాశా లు లభిస్తాయి. మీ దూరదృష్టి వలన మీ పని సులభంగా పూర్తవుతుంది. ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. అనుభవజ్ఞులైన వ్యక్తులు మీకు ఉపాధి రంగంలో సాయం చేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. తోబుట్టువుల సాయం అందుతుంది. ఆర్ధిక ప్రయోజనాలతో జీవిత భాగస్వామి కూడా సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః శ్రీకాలభైరవాష్టకం పారాయణం చేయండి.

 

మిధునరాశి: ఈరోజు వైవాహిక జీవితంలో చిన్న ఇబ్బందులు !

ఏదైనా పధకం పై డబ్బు ఖర్చు చేయాలనుకుంటే అది మీకు కలిసొస్తుంది. లేకపోతె ఇప్పుడున్న చోటునే డబ్బుని భద్రంగా ఉంచుకోండి. పని వాతావరణం గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వైవాహిక జీవితంలో చిన్నచిన్న ఇబ్బందులు కలుగుతాయి. ప్రయాణాలు చేయకండి.

పరిహారాలుః శివారాధన, వనభోజనం చెప్పకోతగ్గ పరిహారం.

 

కర్కాటకరాశి: ఈరోజు వ్యాపారులకు అనుకూలం !

ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. కెరీర్ కు సంబంధించిన ప్రతిపాదనలు చేస్తారు. వ్యాపారస్తులకు అనుకూల కాలం. స్నేహితుల సహకారం లబిస్తుంది.  వ్యాపారంలో వృధ్ది ఉంటుంది. కుటుంబ జీవితం కోసం కొంత సమయం కేటాయిస్తారు. వైవాహిక జీవితంలో ఆనందం పెరగుతుంది.

పరిహారాలుః శ్రీకృష్ణ ఆరాధన చేయండి. అనుకూలంగా ఉంటుంది.

 

సింహరాశి: ఈరోజు అన్ని పనుల్లో విజయం !

ఈరోజు అనుకూల ఫలితాలు, పెట్టుబడుల్లో రిస్క్ తీసుకోవడానికి ఇది అనుకూల సమయం. పెద్దల సలహాతో వ్యాపారాన్ని మరింత వృద్ధి చేస్తారు. సవాళ్ళను చక్కగా ఎదుర్కొంటారు. అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం బిజీగా గడుస్తుంది.

పరిహారాలుః తెల్లజిల్లేడుతో శివరాధన చేయండి.

 

కన్యరాశి: ఈరోజు పెండింగ్‌ పనులు పూర్తి చేస్తారు !

ఈరోజు మిశ్రమఫలితాలు వస్తాయి. చాలాకాలంగా ఉండే బోరింగ్‌ పోవడానికి సెలవు దినాల్లో ఏదైనా టూర్ ప్లాన్ చేయండి. పెండింగ్‌ పనులను పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సంపదను, పేరు ప్రతిష్టలను పెంచుతారు.    కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః శ్రీ సూర్యారాధన చేయండి. ఆరోగ్యం బాగుంటుంది.

 

తులరాశి: ఈరోజు అనుకూల వాతావరణం !

ఈరోజు అన్నిచోట్ల అనుకూలంగా ఉంటుంది. ఇంట బయటా సమస్యలు పరిష్కారం అవుతాయి. వాతావరణం మీకు అనుకూలిస్తుంది. కొత్త పనులు చేయడానికి ఇది సరైన సమయం. ఉన్నత విద్యకు  అవకాశాలు వస్తాయి. కుటుంబ జీవితంలో మీరు గౌరవం పొందుతారు. వైవాహికంగా సంతోషంగా ఉంటారు.

పరిహారాలుః శ్రీ సత్యనారాయణస్వామి ఆరాధన చేయండి.

 

వృశ్చికరాశి: ఈరోజు మీ నిర్ణయాలకు అనుకూల ఫలితాలు!

ఈరోజు ఫలితాలు బాగుంటాయి. మీరు తీసుకున్న నిర్ణయాలు అనుకూలంగా మారుతాయి. ఈరోజు ప్రయాణాల్లో మీ సామాను జాగ్రత్తగా చూసుకోండి. విదేశాల్లో నివసిస్తున్న బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. తల్లి తండ్రుల ఆశీర్వాదాలు లభిస్తాయి. వైవాహిక జీవితంలో ఒడిదొడుకులు వస్తాయి. కానీ అధిగమిస్తారు.

పరిహారాలుః శ్రీరామాలయంలో ప్రదక్షణలు, పూలమా ల సమర్పణ చేయండి.

 

ధనుస్సురాశి: ఈరోజు విజయం సాధిస్తారు!

ఈరోజు అనుకూలం. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోరుకునే వారికి విజయం లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటపుడు మీ జీవిత భాగస్వామిని సంప్రదిస్తే, మీకు లాభం చేకూరుతుంది. మీ నూతన వ్యాపార భాగస్వాములు మీకు లాభం కలిగిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.

పరిహారాలుః శ్రీ శివకవచం పారాయణం చేయండి. మంచి ఫలితాలను పొందండి.

 

మకరరాశి: ఈరోజు ఆర్థికంగా బాగుంటుంది!

ఈరోజు ఆర్థికంగా బాగుంటుంది. మీ ఆలోచనలు సానుకూల ఫలితాలను తీసుకువస్తాయి. మీ కుటుంబంతో ఉన్న సత్సంబంధాలు ఉపశమనం కలిగిస్తాయి. మీ వ్యాపారంలో సోదరుల సహకారం అందిస్తారు. వైవాహికజీవితంలో ఆనందంతో గడుపుతారు.

పరిహారాలుః గురుగ్రహారాధన, అవకాశం ఉంటే పుష్కరస్నానం చేయండి.

 

కుంభరాశి: ఈరోజు విజయం మీ సొంతం !

ఈరోజు అనుకూల ఫలితాలు. కోర్టుకు సంబంధించిన వ్యవహారాల కోసం లాయర్లను కలవడానికి అనుకూలమైన రోజు. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు బాగుంటాయి. మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవడానికి కొత్త ప్రాజెక్ట్లను ఒప్పుకుంటారు. కష్టపడితే, విజయం మీ సొంతం. వైవాహిక జీవితంలో పిల్లలు మీకు ఆనందకారకులు అవుతారు.

పరిహారాలుః శ్రీశివాష్టోతరం చదవండి. మారేడుదళాలతో శివారాధన చేయండి.

 

మీనరాశి: ఈరోజు ఆరోగ్యం జాగ్రత్త!

ఈరోజు మిశ్రమఫలితాలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా భయపడుతుంటారు. ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంటుంది. తప్పుడు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లల చదువులకోసం ఖర్చు పెడుతారు. ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండి. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది.

పరిహారాలుః గురుగ్రహ ఆరాధన, నవగ్రహస్తోత్రం పారాయణం చేయండి.

-శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news