నవంబర్ 29 ఆదివారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

Join Our Community
follow manalokam on social media

నవంబర్‌-29-ఆదివారం.కార్తీకమాసం.

మేషరాశి: ఈరోజు సంతోషంగా ఉంటారు !

ఈరాశి వారికి సంతోషకరంగా ఉంటుంది. ఈ రోజు మీకు గొప్ప విశ్రాంతి కలుగుతుంది. మీదగ్గర ఈరోజు పెద్ద మొత్తంలో డబ్బు ఉండటం ద్వారా మీరు సంతృప్తి చెందుతారు. స్నేహితులకు సహాయం చేయండి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కారణంగా మీరు కొంచం అసంతృప్తికి గురి అవుతారు. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః శ్రీసూర్యనారాయణ స్వామి ఆరాధన చేయండి.

todays horoscope

వృషభరాశి: ఈరోజు ఆరోగ్యం జాగ్రత్త !

ఈరాశి వారికి ఆనారోగ్య సూచన. ఈరోజు వివాదాలకు దూరంగా ఉండండి. కోపాన్ని నియంత్రించుకోండి. మీ వృత్తిపై దృష్టి పెట్టండి. ఎవరైన వ్యక్తులు నూతన ప్రతిపాదనలు మీ ముందు ఉంచినప్పటికీ పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. ఈరోజు సంతానంపై దృష్టి పెట్టండి. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీసూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.

మిథునరాశి: ఈరోజు ఆర్థికప్రయోజనాలు అందుకుంటారు !

ఈరోజు అనుకూల, ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఈ రోజు మీరు కొత్త పని చేయడం ప్రారంభించవచ్చు. దీనివల్ల ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు. ఆరోగ్యం, ఆర్థిక విషయాలను విస్మరించవద్దు. మీకు అలా చేయడం కష్టతరంగా ఉంటుంది. రియల్ ఎస్టేటులో పెట్టుబడులు పెట్టడం మీకు శుభకరంగా ఉంటుంది. ప్రస్తుతం మీరు మంచి రాబడిని పొందుతారు. వైవాహికంగా సాధారణంగా ఉంటుంది.

పరిహారాలుః శ్రీశివాష్టోతరంతో పూజ, వనభోజనం చెప్పుకోతగ్గ సూచన.

కర్కాటకరాశి:ఈ రోజు అనుకూలంగా ఉంటుంది !

మీ ఆఫీస్‌లో తోటివారి మద్దతు లభిస్తుంది. అన్ని రంగాల్లో మీరు ముందుకు సాగుతారు. ఈరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీరు పాత బాకీలు చెల్లిస్తారు. ఈరోజు ఇంట్లో మీకు అనుకూలంగా ఉంటుంది. మీకు విజయం లభిస్తుంది. పనులు సాఫీగా సాగడంతోపాటు వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీసూర్యాష్టకం పారాయణం చేయండి.

సింహరాశి: ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది !

ఈరోజు అనుకూల ఫలితాలు. స్నేహితుల సహకారం లభిస్తుంది. మంచి ఆరోగ్యంతో ఉంటారు. దీనివల్ల మీరు అన్ని కార్యకలాపాలను చురుకుగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః తులసీ దగ్గర ప్రదోషకాలంలో అంటే సాయంత్రం దీపారాధన చేయండి.

కన్యరాశి: ఈరోజు అనుకున్న పనులు పూర్తిచేస్తారు !

ఈరోజు బాగుంటుంది. ఈ రోజు మీరు అనుకున్న పనులు పూర్తిచేయడంలో విజయం సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. పెద్దల సలహాలు తీసుకోండి. మీరు మీ పనిని పూర్తి అంకిత భావంతో చేయగలుగుతారు. ఆర్థిక విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది. వైవాహికంగా సంతోషంగా ఉంటారు.

పరిహారాలుః ధాత్రి అంటే ఉసిరి చెట్టుదగ్గర దీపారాధన మంచి ఫలితాన్నిస్తుంది.

 

తులరాశి: ఈరోజు వృత్తిలో ప్రయోజనం పొందుతారు !


ఈరోజు వ్యాపార భాగస్వామ్యాలు కలసి వస్తాయి. వృత్తిలో ప్రయోజనం పొందుతారు. ఈ రోజు ఉద్యోగం లేదా వ్యాపారంలో విజయాన్ని అందుకుంటారు. పిల్లల చదువుపై దృష్టిసారిస్తారు. సాయంత్రం సమయాన్ని సరదాగా గడుపుతారు. ఈ రోజు మీకు వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శివాలయంలో ఆవునెయ్యి, తేనే వంటి పదార్థాలను సమర్పిచండి.

వృశ్చికరాశి: ఈరోజు పనిలో విజయం సాధిస్తారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీరు పనిలో విజయాన్ని సాధిస్తారు. కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. ధైర్యంతో పనిచేస్తే విజయం సాధిస్తారు. కార్యాలయంలో, కుటుంబంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలు: కార్తీకదామోదర ఆరాధన చేయండి.

ధనస్సురాశి: ఈరోజు ధనం అనవసరంగా ఖర్చు పెట్టకండి !

ఈరోజు ధనం అనవసరంగా ఖర్చు పెట్టకండి. ఇతర వ్యక్తుల పని కోసం ఎక్కువ సమయం, శక్తిని వృథా చేయవద్దు. ఈరాశి వారు మీరు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. వివాదాలకు దూరంగా ఉండండి. వైవాహికంగా సంతోషం, ఆనందం ఉంటుంది.

పరిహారాలుః శ్రీలక్ష్మీ ఆరాధన చేయండి. మంచి ఫలితం వస్తుంది.

మకరరాశి: ఈరోజు ధైర్యంతో విజయం సాధిస్తారు !

ఈరోజు మీకు ప్రతికూలంగా ఉంటుంది.కానీ మీరు దాన్ని అధిగమిస్తారు. ఈ రోజు ప్రత్యేక యోగాలు ఉన్నాయి. ఈ రోజు మీరు మానసిక సమ్యలను ఎదుర్కొంటారు. కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ధైర్యంగా సమస్యలను దాటి విజయం సాధిస్తారు. సంతానం వల్ల ప్రయోజనాలు పొందుతారు. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శని, గురుగ్రహాల స్తోత్రం పారాయణం చేయండి.

కుంభరాశి

ఈరోజు మిశ్రమఫలితాలు వస్తాయి. ప్రతి సందర్భంలోనూ కోపాన్ని ప్రదర్శించడం మానుకోండి. గతాన్ని వదిలి వర్తమానంలో ముందుకు సాగండి. ఈ రోజు మీరు ఉహించని మార్పులకు అవకాశముంది. పనిలో విజయం సాధిస్తారు. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీశివారాధన మంచి ఫలితాన్నిస్తుంది.

మీనరాశి: ఈరోజు వివాదాలు రావచ్చు జాగ్రత్త !

ఈరోజు మీకు కొన్ని సమస్యలు వస్తాయి. అదేసమయంలో  మీరు కష్టాలను అధిగమించి ముందుకు సాగుతారు. దీనికి కారణం గ్రహాల స్థానం మీకు అనుకూలంగా ఉండటం. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యుల నుంచి మీకు కావాల్సిన మద్దతు లభించదు. వైవాహికంగా ఇబ్బందులు ఎదురుకుంటారు. కానీ చివరకు అంతా సంతోషంగా ఉంటుంది.

పరిహారాలుః రావి చెట్టుదగ్గర విష్ణు ఆరాధన చేయండి. అనుకూల ఫలితాలు వస్తాయి.

-శ్రీ

TOP STORIES

10వ త‌ర‌గ‌తి అర్హ‌త‌తో పోస్టాఫీస్‌లో ఉద్యోగాలు.. వెంట‌నే అప్లై చేయండి..!

తెలంగాణ స‌ర్కిల్‌లో గ్రామీణ్ డాక్ సేవ‌క్స్ (జీడీఎస్) పోస్టుల భ‌ర్తీకి గాను ఇండియా పోస్ట్ ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగానే...