అక్టోబర్ 23 శుక్రవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

అక్టోబర్‌ – 23 – ఆశ్వీయుజమాసం – శుక్రవారం.

మేష రాశి: ఈరోజు ఇష్టపడేవారితో గడపండి !

మీ చుట్టుప్రక్కల ఉన్నవారు మీకు సహాయం చెయ్యడం తో, మీకు సంతోషం కలుగుతుంది. ఖర్చు పెరుగుతుంది, మిమ్మల్ని ఇష్టపడి, మరియు శ్రద్ధగా చూసుకునే వారితో విలువైన సమయాన్ని కొంతసేపు గడపండి. కష్టపడి పని చెయ్యడం, ఓర్పు వహించడం ద్వారా, మీరు మీ లక్ష్యాల ను చేరుకుంటారు. ఈరాశిలో ఉన్నవిద్యార్థులు ఈరోజు మొత్తం ఫోనులకు అతుక్కుపోతారు. మీ బెటర్ హాఫ్ ను తరచూ సర్ ప్రైజ్ చేస్తూ ఉండండి. లేదంటే తను తనకు ప్రాధాన్యమేమీ లేదని బాధపడవచ్చు.

పరిహారాలుః మంచి ఆర్థిక జీవితం కోసం, ‘ఓం దుం దుర్గాయేనమః’’ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి

todays horoscope

వృషభ రాశి: ఈరోజు లాభాలు వస్తాయి !

ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుండి వస్తాయి. మీ తెలివికి తగినట్లు ప్లాన్ చేసుకోవడానికి, అత్యుత్తమమైన రోజుది. మీ ప్రేమ జీవితం ఈ రోజు మీకు ఎంతో ఎంతో అద్భుతమైన కానుకను అందించనుంది. ఆఫీసులో ప్రతిదాని పైనా ఈ రోజు మీదే పైచేయి కానుంది. ఈరోజు వ్యాపారస్తులు వారి సమయాన్ని ఆఫీసులో కాకుండా కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఇది మీ కుటుంబంలో ఉత్తేజాన్ని నింపుతుంది. మీ జీవిత భాగస్వామి మీ కోసం ఏదో చాలా స్పెషల్ ప్లాన్ చేశారు. దాంతో ఈ రోజు మీకు చాలా అద్భుతంగా గడవనుంది.

పరిహారాలుః మీ వృత్తి జీవితంలో పురోగతి సాధించడానికి మీ తాతలు, వృద్ధులకు సహాయం చేయండి.

 

మిథున రాశి: ఈరోజు అనారోగ్యం నుంచి విముక్తి !

గ్రహచలనం రీత్యా, అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది, వీలుకల్పిస్తుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం, స్టాక్, మ్యూచ్యువల్ ఫండ్లలో మదుపు చెయ్యాలి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ ఆతృతలకు కారణం కావచ్చును. మీ టీమ్ లో అత్యంత చీకాకు పెట్టే వ్యక్తే ఈ రోజు ఉన్నట్టుండి ఎంతో మేధావిగా మారిపోతాడు. రోజుంతా మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు సంతోషాన్ని అనుభూతి చెందనున్నారు.

పరిహారాలుః కుటుంబ సభ్యులకు సంతోషం ఆనందం మరియు ఆనందాన్ని పెంచుకోవడానికి శ్రీదుర్గామాత పూజ చేయండి.

 

కర్కాటక రాశి: ఈరోజు అభిప్రాయాలను వ్యక్తం చేయండి !

మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనుకాడకండి. ఆత్మవిశ్వాసం లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు. అది మీసమస్యను మరింత జటిలం చేస్తుంది. మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు. ఈ రోజు నుండి ఆదా చేయడం ప్రారంభించండి అధిక వ్యయాన్ని నివారించండి. మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు దుర్వినియోగం చేయడానికి ఒప్పు కోకండి. ఆఫీసులో మీకు ఈ రోజు మంచి ఎదుగుదలకు అవకాశముంది. ఈరోజు ఖాళీసమయంలో, పనులు ప్రారంభించాలి అని రూపకల్పన చేసుకుని ప్రారంభించని పనులను పూర్తిచేస్తారు. కుటుంబీకులతో మీకు సమయం కష్టంగా గడుస్తుండవచ్చు. కానీ చివరికి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆనందంలో ముంచి వేస్తారు.

పరిహారాలుః మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం చేయడానికి పేద ప్రజలకు బియ్యం ఇవ్వండి

 

సింహ రాశి: ఈరోజు బాగా కలసివస్తుంది !

గత వెంచర్లనుండి వచ్చిన విజయం, మీకు మీపట్ల నమ్మ కాన్ని పెంతుంది. చాలారోజులుగా రుణాలకోసము ప్రయ త్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసివస్తుంది. ఆఫీసులో ఈ రోజు మీరు నిజంగా అద్భుతం చేసి చూపించవచ్చు. పెండింగ్లో గల సమస్యలు త్వరలో పరిష్కరించబడాల్సి ఉన్నది, పైగా ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి, అందుకే, సానుకూలంగా స్పందించండి, మీ శ్రమను ఈరోజే మొదలు పెట్టండి. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీతో సమయం గడపలేనంతగా బిజీగా మారవచ్చు.

పరిహారాలుః నలుపు రంగు లేదా నీలం రంగు దుస్తులను తరచూ ఉపయోగించడం, స్థిరమైన, బలమైన ప్రేమ జీవితాన్ని నిర్థారిస్తుంది.

 

కన్యా రాశి: ఈరోజు దూరప్రయాణాలు చేయకండి !

మీరు ప్రయాణానికి బలహీనంగా ఉన్నారు కనుక దూరప్ర యాణాలు తప్పించుకోవడానికి ప్రయత్నించండి. ఇంటి చుట్టూ ప్రక్కల జరిగే చిన్న చిన్న మార్పులు అది మరింత అందంగా ఉండడానికి చేపట్టబడతాయి. తెలియనివారితో వాగ్వివాదానికి దిగుతారు, ఇది మీ మూడును చెడగొ డుతుంది. ఒకరిపట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాల ను మీరిద్దరూ ఈ రోజు చాలా సన్నిహితంగా కలిసి పంచుకుంటారు.

పరిహారాలుః ఆరోగ్యానికి గొప్ప లాభాలను పొందడానికి శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.

 

తులా రాశి: ఈరోజు ఆకస్మాత్తుగా నిధులు !

ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చిపడడంతో, మీ బిల్లులు, తక్షణ ఖర్చులు గడిచిపోతాయి. మీవిచ్చలవిడి ఖర్చుదారీ తనం గల జీవన విధానం, ఇంట్లో కొన్ని టెన్షన్లకు దారి తీస్తుంది, ఈరోజు మీరు, అందరి దృష్టి పడేలాగ ఉంటారు. విజయం మీకు చేరువలోనే ఉంటుంది. సమయము ఎంత దుర్లభమైనదో తెలుసుకొని, దానిని ఇతరులతో గడప కుండా ఒంటరిగా గడపటానికి ఇష్టపడతారు. ఇది మీకు ఆర్ధికంగా బాగా కలిసివస్తుంది. మీ వైవాహిక జీవితం ఈ రోజు పూర్తిగా వినోదం, ఆనందం, అల్లరిమయంగా సాగనుంది.

పరిహారాలుః ఇష్టమైన, సంతోషపరమైన కుటుంబానికి, మీ ఇంటిలో శ్రీకాళికాదేవిని ఆరాధించండి.

 

వృశ్చిక రాశి: ఈరోజు సమయాన్ని వృధా చేయకండి !

ఆర్థిక స్థితిగతులలో మందకొడి రావడం వలన కొంత ముఖ్యమైన పని నిలుపుదల చేయడం జరుగుతుంది. స్వీయ సానుభూతి కోసం సమయాన్ని వృథా చెయ్యకం డి. జీవిత పాఠాలను ప్రయత్నించి, తెలుసుకొండి. చిన్నపాటి అవరోధాలతో, ఈరోజు ఘనమైనదిగా అనిపి స్తుంది. ప్రయాణం అనేది ఆహ్లాదకరం ఎంతో ప్రయోజ నకరం. మీ జీవిత భాగస్వామి తాలూకు బద్ధకం ఈ రోజు మీ పనులను చాలావరకు డిస్టర్బ్ చేయవచ్చు.

పరిహారాలుః మంచి ఆరోగ్యానికి రాత్రిపూట బార్లీ నానబెట్టి, ఉదయం పూట జంతువులకు, పక్షులకు పంపిణీ చేయండి

 

ధనుస్సు రాశి: ఈరోజు మీ విచక్షణలో మార్పు !

మీరేమని అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్త మమైన రోజు. మీకున్న నిధులు జారిపోతున్నా కూడా మీరేం చేయలేని పరిస్థితి. ఎప్పుడూ వెలుగు దిశగా చూడండి, మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది. ఆఫీసులో ఈరోజు మీదే కానుంది. ఈరోజు మీరు బంధాల ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. మీరు సాధ్యమైంత వరకు మీ సమయాన్ని కుటుంబసభ్యులతో గడుపుతారు.

పరిహారాలుః మీ సంపదను పెంచుకోవటం కోసం శ్రీదుర్గా లక్ష్మీ ఆరాధన చేయండి.

 

మకర రాశి: ఈరోజు స్నేహితుల వల్ల సంతోషం !

స్నేహితులు, మీకు సపోర్టివ్ గా ఉండి, మీకు సంతోషాన్ని కలిగిస్తారు. ఈరోజు మీ తల్లితండ్రులు మీ విలాసవంతమైన జీవితం, ఖర్చులపట్ల ఆందోళన చెందుతారు. మిమ్మల్ని ద్వేషించేవారికి కేవలం “హలో” చెబితే చాలు, ఆఫీసులో అన్ని విషయాలూ ఈ రోజు మీకు ఎంతో అద్భుతంగా మారనున్నాయి. మీఖాళీ సమయాన్ని మీ ఆప్తమిత్రు డితో గడుపుతారు. మితిమీరిన ఆకాంక్షలు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో కలతలకు దారితీయవచ్చు.

పరిహారాలుః మరింత సంతృప్తికరమైన జీవితం కోసం శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.

 

కుంభ రాశి: ఈరోజు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి !

పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపిం చినా లోతుగా ఆలోచించి మూలాలు పూర్వాపరాలు మరిన్ని తెలుసుకొండి. ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు, అనుభవజ్ఞుల సలహా పొందండి. చిన్న పిల్లలు మిమ్మల్ని బిజీగా ఇంకా సంతోషంగా ఉండేలాగ చేస్తారు. ఈరోజు మీరు అనుభ విస్తున్న జీవితసమస్యలను మీ భాగస్వామితో పంచుకుం టారు. పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి. ఈరోజు మీరు ఖాళి సమయంలో ఇప్పటివరకు పూర్తిచేయని పనులను పూర్తిచేయడానికి ప్రయత్నిస్తారు.

పరిహారాలుః శ్రీదుర్గాదేవి ఆరాధన మంచి ఫలితాన్ని స్తుంది.

 

మీన రాశి: ఈరోజు రెస్యూమ్‌ పంపడానికి మంచిరోజు !

ఉమ్మడి వ్యాపారాలలోను, ఊహల ఆధారితమైన పథకాల లోను పెట్టుబడి పెట్టకండి. మీ రెస్యూమ్ ని పంపించడానికి లేదా ఇంటర్వ్యూలకి వెళ్ళడానికి మంచి రోజు. ఒక్కసారి మీరు ఫోనులో అంతర్జాలాన్ని ఉపయోగించిన తరువాత మీరు మీ సమయాన్ని ఎంతవృధా చేస్తున్నారో తెలుసుకోలేరు, తరువాత మీ తప్పును తెలుసుకుంటారు. చక్కని అనుభూతులను మరోసారి ఈ రోజు మీరు సొంతం చేసుకుంటారు.

పరిహారాలుః మంచి జీవితం కోసం శ్రీకాళీకాదేవిని, లక్ష్మీదేవిని ఆరాధించండి.

 

-శ్రీ