నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-2.. ప్రయోగం సక్సెస్..!

-

భారతదేశం తన చరిత్రలో మరో సువర్ణాధ్యాయాన్ని లిఖించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇవాళ చంద్రయాన్-2ను విజయవంతంగా ప్రయోగించింది.

భారతదేశం తన చరిత్రలో మరో సువర్ణాధ్యాయాన్ని లిఖించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇవాళ చంద్రయాన్-2ను విజయవంతంగా ప్రయోగించింది. మధ్యాహ్నం 2.43 గంటలకు ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్-2ను ప్రయోగించారు. జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3 రాకెట్ చంద్రయాన్-2ను నింగిలోకి మోసుకెళ్లింది. కౌంట్‌డౌన్ పూర్తవ్వగానే రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగిరింది.

chandrayaan 2 success

కాగా జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3 రాకెట్ బరువు సుమారుగా 3850 కిలోలు ఉండగా, ఆటోమేటిక్ లాంచ్ సీక్వెన్స్ ద్వారా దీన్ని సైంటిస్టులు ప్రయోగించారు. ఈ క్రమంలోనే రాకెట్ క్రయోజెనిక్ స్టేజ్ విజయవంతమైంది. ఇక చంద్రయాన్-2 లాంచింగ్‌ను ఇస్రో చైర్మన్ శివన్‌తోపాటు పలువురు సైంటిస్టులు మిషన్ కంట్రోల్ రూం నుంచి వీక్షించారు. అలాగే పలువురు వీవీఐపీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3 రాకెట్ సుమారుగా 43.5 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇక చంద్రయాన్-2 లో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞ రోవర్ ఉంటాయి.

చంద్రయాన్-2 చంద్రుని కక్ష్యకు చేరేందుకు 50 రోజులు పడుతుందని తెలుస్తుండగా.. అక్కడికి చేరగానే విక్రమ్ ల్యాండర్ చంద్రయాన్-2 నుంచి విడిపోయి రోవర్ ప్రజ్ఞను చంద్రుని ఉపరితలంపై సేఫ్‌గా దింపుతుంది. దీంతో రోవర్ ప్రజ్ఞ చంద్రునిపై తిరుగుతూ అక్కడి మట్టి, ఇతర నమూనాలను సేకరించి విశ్లేషిస్తుంది. అనంతరం ఆ వివరాలను ప్రజ్ఞ చంద్రయాన్-2కు పంపుతుంది. అక్కడి నుంచి ఆ వివరాలు మనకు అందుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news