స్పేస్​లో సునీత విలియమ్స్ డ్యాన్స్‌.. వీడియో వైరల్‌..!

-

బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌక గురువారం విజయవంతంగా ఐఎస్‌ఎస్‌కు అనుసంధానమైంది. భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) చేరుకున్నారు. ఆమెతో పాటు మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌ కూడా చేరుకున్నారు. ఈ సందర్భంగా వ్యోమగాములకు అక్కడ ఘన స్వాగతం లభించింది.

సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం.. గంటకొట్టి వారిని ఆహ్వానించారు. ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న సునీత డ్యాన్స్‌ చేశారు. గాల్లో తేలుతూ స్టెప్పులేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న మరో ఏడుగురు వ్యోమగాములను ఆలింగనం చేసుకొని తన సంతోషాన్ని వ్యక్తపర్చారు. దీనికి సంబంధించిన వీడియోను బోయింగ్‌ స్పేస్‌ తన ఎక్స్‌ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఐఎస్‌ఎస్‌లో భారరహిత స్థితి ఉంటుందనే విషయం తెలిసిందే. ఆ పరిస్థితుల్లో సునీత చేసిన డ్యాన్స్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news