coronavirus

మేడ్చల్: ఎమ్మెల్సీకి కరోనా

మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూరం రాజుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణైంది. తనకు స్వల్పంగా కరోనా లక్షణాలు ఉండటంతో టెస్ట్ చేసుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైందని చెప్పారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానని ఇటీవలే తనని కలిసిన వారు కరోనా పరీక్షలు చేసుకోవాలని ఆయన కోరారు.

రంగారెడ్డి : జిల్లాలో భారీగా కరోనా కేసులు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 635 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులిటెన్‌లో వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 348, వికారాబాద్ 46, రంగారెడ్డి జిల్లాలో 241 కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి, కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు....

రంగారెడ్డి : నకిలీ వ్యాక్సిన్ ముఠా అరెస్ట్

పాతబస్తీ కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ వాక్సిన్ సర్టిఫికెట్లు అందజేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాక్సిన్ తీసుకోకున్నా తీసుకున్నట్టు ఫేక్ సర్టిఫికెట్లు అందిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. వారి వద్ద నుండి నకిలీ వ్యాక్సిన్ సర్టిఫికేట్లు, సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సంగారెడ్డి: జిల్లా వ్యాప్తంగా 7,785 మందికి టీకాలు

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా బుధవారం 7,785 మంది వ్యాక్సిన్ తీసుకున్నారని జిల్లా ఇన్చార్జి వైద్య అధికారిని ఒక ప్రకటనలో తెలిపారు. పి.హెచ్.సి ల స్థాయిలో 2,117, ఆరోగ్య ఉప కేంద్రాల్లో 4,628, పురపాలక పరిధిలో 667, 15 నుంచి 18 ఏళ్ల వారు 347, బూస్టర్ డోస్ 26 మందికి ఇచ్చామని జిల్లా ఇంచార్జ్...

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తగ్గిన కరోనా కేసులు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేడు కరోనా కేసులు కాస్త తగ్గాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు 216 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో 55, కరీంనగర్ 79, సిరిసిల్ల 31, పెద్దపల్లి జిల్లాలో 51 కేసులు నమోదైనట్లు చెప్పారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు మరింత...

జనసంద్రమైన మేడారం పరిసరాలు

మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. మహా జాతర సమీపిస్తుండడం, కరోనా, ఒమిక్రాన్ విజృంభిస్తుండడంతో భక్తులు ముందుగానే తల్లులను దర్శించుకుంటున్నారు. ఎండోమెంట్ అధికారులు, ఆలయ పూజారులు కరోనా నిబంధనలు పాటిస్తూ దర్శనాలకు అనుమతిస్తున్నారు. మాస్కులు ధరించని వారికి దర్శనానికి అనుమతించడం లేదు. నేడు సెలవు కావటంతో పెద్దఎత్తున్న భక్తులు...

వరంగల్ బల్దియాను వెంటాడుతున్న కరోనా

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్‌లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. వారం రోజుల్లోనే 30 మంది అధికారులు, ఉద్యోగులు కరోనా బారినపడ్డారు. శానిటేషన్ కార్మికులు 55 మందికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. బల్దియాలోని అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు కరోనాతో హోం ఐసోలేషన్లో ఉంటున్నారు. కోవిడ్ లక్షణాలతో కమిషనర్ ప్రావీణ్య క్యాంపు కార్యాలయంలోనే ఉంటున్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా ఉద్ధృతి

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో 234 కరోనా కేసులు నమోదు అయ్యాయని జిల్లా వైద్య అధికారులు సూచించారు. ఇందులో భాగంగా సంగారెడ్డి 88, మెదక్ 59, సిద్దిపేట 87 కేసులు చొప్పున నమోదయ్యాయి. ఈ సందర్భంగా వైద్య అధికారులు మాట్లాడుతూ.....

రంగారెడ్డి జిల్లాలో కరోనా కల్లోలం

రంగారెడ్డి జిల్లాలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 843 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులిటెన్‌లో వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 432, వికారాబాద్ 89, రంగారెడ్డి జిల్లాలో 322 కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి, కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు....

ఉమ్మడి మెదక్ జిల్లా కరోనా అప్డేట్

ఉమ్మడి జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొత్తగా 244 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 95, సిద్దిపేట జిల్లాలో 82, మెదక్ జిల్లాలో 67 చొప్పున నమోదయ్యాయి. థర్డ్ వేవ్, ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతి నేపథ్యంలో ప్రజలు అజాగ్రత్తగా ఉండొద్దని, విధిగా మాస్కులు ధరించాలని వైద్యాధికారులు సూచించారు.
- Advertisement -

Latest News

పవన్ ‘యాత్ర’..టార్గెట్ ‘సీఎం’!

రాజకీయాల్లో పాదయాత్రకు మంచి మైలేజ్ వస్తుందనే చెప్పాలి..పాదయాత్ర చేస్తూ..ప్రజల దగ్గరకు వెళ్ళే ఏ నాయకుడుకైన రాజకీయంగా సక్సెస్ అవ్వాల్సిందే...ఇప్పటివరకు పాదయాత్ర చేసిన వారు పెద్దగా ఫెయిల్...
- Advertisement -

IND vs ZIM : శిఖర్ ధావన్‌ అరుదైన ఘనత.. సచిన్, ధోనీ, కోహ్లీ సరసన!

టీమిండియా వెటరన్ ఓపెనర్ షికర్ ధావన్ అంతర్జాతీయ వన్డేల్లో అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో 6500 పరుగుల మైలురాయిని అందుకున్న పదో భారత బ్యాటర్ గా ధావన్ రికార్డుల ఎక్కాడు. హరారే వేదికగా...

విదేశీ అమ్మాయిలతో లోకేష్‌ ఎంజాయ్‌..ఫోటోలు షేర్‌ చేసిన విజయసాయి !

టీడీపీ అగ్రనేత నారా లోకేష్‌ పై రాజ్యసభ సభ్యులు, వైసీపీ పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్‌ చేశారు. విదేశీ అమ్మాయిలతో నారా లోకేష్‌ దిగిన ఫోటోలను తన ట్విట్టర్‌...

జన్మాష్టమి రోజున కృష్ణుడి ఫేవరెట్ స్వీట్స్ చేయండిలా..

కృష్ణభగవానుడు అలంకార ప్రియుడే కాదు.. ఆహార ప్రియుడు కూడా. కన్నయ్యకు యశోదమ్మ వండిపెట్టే భోజనమంటే మహాప్రీతి. వెన్న తర్వాత కిట్టయ్యకు అటుకుల పాయసం, రవ్వలడ్డూలు అంటే మహాప్రీతి. ఇవాళ కృష్ణుడి పుట్టిన రోజు....

సెన్సేషనల్ సర్వే: ఆ పార్టీదే ఆధిక్యం!

ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వేల హవా ఎక్కువైపోయింది...నేషనల్ స్థాయి నుంచి...లోకల్ స్థాయి వరకు ఏదొక సర్వే వస్తూనే ఉంది...ఇటీవల నేషనల్ సర్వేలు ఎక్కువ వస్తున్న విషయం తెలిసిందే...ఈ సర్వేల్లో ఏపీలో...