మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. మహా జాతర సమీపిస్తుండడం, కరోనా, ఒమిక్రాన్ విజృంభిస్తుండడంతో భక్తులు ముందుగానే తల్లులను దర్శించుకుంటున్నారు. ఎండోమెంట్ అధికారులు, ఆలయ పూజారులు కరోనా నిబంధనలు పాటిస్తూ దర్శనాలకు అనుమతిస్తున్నారు. మాస్కులు ధరించని వారికి దర్శనానికి అనుమతించడం లేదు. నేడు సెలవు కావటంతో పెద్దఎత్తున్న భక్తులు తరలివచ్చారు.