ఇప్పటి నుండి అలెక్సా తెలుగులో …!

-

అలెక్సా యాప్‌ ని ఇంగ్లిష్‌, హిందీలో మాత్రమే ఉపయోగించడం అయ్యేది. కానీ ఇప్పుడు దీనిని తెలుగు లోకి తీసుకు వచ్చారు. అచ్చ తెలుగులో అలరిస్తుందంటే మరెంత బాగుటుంది కదా..! దీనిని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌ అభివృద్ధి చేయడం జరిగింది. ఇలా తెలుగు లోకి తీసుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే…? ప్రాంతీయ భాషలకు ప్రాచుర్యం కల్పించేందుకే… అయితే ఇలా ప్రాచుర్యం పొందడానికి ‘బహు భాషక్‌’ పేరిట ఐఐటీ హైదరాబాద్‌ లో లాంగ్వేజ్‌ టెక్నాలజీ రిసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

ఇది ఇలా ఉండగా కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద రూ.కోటి మంజూరు చేసింది. దీని మూలంగా ఐఐటీ బృందం తెలుగు స్పీచ్ ‌డాటా సెట్‌ను అభివృద్ధి చేసింది. ప్రాంతీయ భాషల్లో మొదటి స్థానాన్ని తెలుగు సొంతం చేసుకోవడం విశేషం. పైలట్‌ ప్రాజెక్ట్ ‌లో భాగంగా తెలుగు లో 2 వేల గంటల పాటు పని చేసే డాటా సెట్‌ను తయారు చేశామని ప్రొఫెసర్లు చెప్పడం జరిగింది.

కృత్రిమ మేధస్సు గల ఈ డాటా సెట్ ‌లో ఎంత డాటా నిక్షిప్తం చేస్తే అంత సమర్థంగా పని చేస్తుందని అందు కోసమే ఇలా 2 వేల గంటల పాటు పని చేసే డాటా సెట్‌ను ఉపయోగించి చేయడం జరిగింది అని వెల్లడించారు. తెలుగు లో అలెక్సా యాప్‌ ని తీసుకు రావడం వల్ల భాషాపరమైన సమస్యలను అధిగమించినట్లవుతుందని కూడా వాళ్ళు తెలియ జేయడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version