అమెజాన్ ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ 2021.. ఫోన్ల‌పై 40 శాతం త‌గ్గింపు ధ‌ర‌లు..

Join Our Community
follow manalokam on social media

ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ త‌న సైట్‌లో ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ 2021 సేల్‌ను నిర్వ‌హిస్తోంది. ఈ సేల్ ఈ నెల 25వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన స్మార్ట్ ఫోన్ల‌పై వినియోగ‌దారుల‌కు 40 శాతం వ‌ర‌కు డిస్కౌంట్ ల‌భిస్తుంది. కోట‌క్ మ‌హీంద్రా క్రెడిట్ కార్డులు ఉన్న‌వారు ఫోన్ల‌పై అద‌నంగా మ‌రో 10 శాతం డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ, డిస్కౌంట్ కూప‌న్లు, ఎక్స్‌చేంజ్ ఆఫ‌ర్ల‌ను కూడా అమెజాన్ అందిస్తోంది.

amazon fab phone fest 2021 offers 40 percent discount on phones

ఈ సేల్‌లో వ‌న్‌ప్ల‌స్ 8టి 5జి ఫోన్‌ను రూ.42,999కు బ‌దులుగా రూ.36,999కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇత‌ర ఫోన్ల‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే గ‌రిష్టంగా రూ.12,400 వ‌ర‌కు ధ‌ర పొంద‌వ‌చ్చు. అలాగే నెల‌కు రూ.2024 ఈఎంఐతో ఫోన్‌ను కొన‌వ‌చ్చు. వ‌న్‌ప్ల‌స్ 8టి లో 6.55 ఇంచుల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగ‌న్ 865 ప్రాసెస‌ర్‌, క్వాడ్ కెమెరా సెట‌ప్‌, 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 65 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి.

అలాగే వ‌న్‌ప్ల‌స్ 8 ప్రొ ధ‌ర రూ.54,999 ఉండ‌గా దీన్ని రూ.47,999కు కొన‌వ‌చ్చు. రెడ్‌మీ నోట్ 9 ప్రొను రూ.11,999 ప్రారంభ ధ‌ర‌కు కొన‌వ‌చ్చు. ఐఫోన్ 12 మినీ రూ.64,990 ప్రారంభ ధ‌ర‌కు ల‌భిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం51ను రూ.22,999కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. దీనిపై రూ.1250 కూప‌న్ డిస్కౌంట్ ల‌భిస్తుంది. దీంతో ఫోన్ ధ‌ర రూ.21,749 అవుతుంది. అలాగే నో కాస్ట్ ఈఎంఐ ఆప్ష‌న్‌ను పొంద‌వ‌చ్చు. ఇంకా ప‌లు ఇత‌ర ఫోన్ల‌పై కూడా ఈ సేల్‌లో త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు.

TOP STORIES

నమ్మండి.. ఈ ప్లాస్టిక్‌ పర్యావరణానికి హాని కలిగించదు

పర్యావరణానికి హాని చేయని ప్లాస్టిక్‌ కవర్లను చూశారా? ప్లాస్టిక్‌ పర్యావరణానికి హాని కలిగించదా! అని ఆశ్చర్యపోకండి. మీరు విన్నది నిజమేనండి. మనం వాడి పడేసిన కవర్లు...