స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ‘అమెజాన్‌ మెంటర్‌ కనెక్ట్‌’!

-

స్టార్టప్‌ కంపెనీలను ప్రోత్సహించిందుకే ప్రముఖ ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ‘మెంటర్‌ కనెక్ట్‌’ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. అయితే ఈ ప్రోగ్రాం స్టార్టప్‌లకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ఏప్రిల్‌ 11న ప్రారంభమైన ఈ కొత్త ప్రోగ్రాం ఎటర్‌ప్రెన్యూర్స్, ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్‌ మధ్య బ్రిజ్‌ అవ్వనుంది. కొత్తగా ఏర్పడిన స్టార్టప్‌ సంస్థలు వాటి అభివృద్ధి చెందుతున్న బ్రాండ్లను ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడుతుంది.

దీనికి గాను సంబంధిత అధికారులతో మెంటర్‌షిప్‌ సెషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు అమెజాన్‌ ప్రకటించింది. స్టార్టప్‌లకు తోడ్పాటు అందించేందుకు ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు చెందిన మెంటర్స్‌, ఫైర్‌సైడ్‌ వెంచర్స్, ఎలివేషన్‌ క్యాపిటల్‌ ఇతన సంస్థలు ఈ ప్రోగ్రామ్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాయి. ఇప్పటికే అమెజాన్‌ లాంచ్‌ప్యాడ్‌ ప్రోగ్రామ్‌లో చేరిన స్టార్టప్స్‌, ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్‌ నుంచి వివిధ మార్గాల ద్వారా గైడ్‌లైన్స్‌ పొందవచ్చు. మూడు నెలల పాటు వీరు వివిధ స్టార్టప్‌ సంస్థలకు గైడ్‌లైన్స్‌ అందిస్తారు.

దీనిలో మొదట స్టార్టప్‌ కంపెనీలు తమ బ్రాండ్‌ను ఎలా విస్తరించుకోవాలనే అంశాలపై సెషన్లు నిర్వహిస్తారు. స్టార్టప్‌ సంస్థల మధ్య పోటీ వాతావరణం ఏర్పర్చేందుకు అమెజాన్‌ సంభవ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ఛాలెంజ్‌ను కూడా నిర్వహిస్తోంది. ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్‌ సలహాలు పాటించి తమ బ్రాండ్స్‌ను విస్తరించుకున్న స్టార్టప్‌ సంస్థలకు సమ్మిట్‌లో విజేతలను ప్రకటించి వారికి అదనపు ప్రయోజనాలను అందిస్తారు. ‘అమెజాన్‌ సంభవ్‌‘ 2వ ఎడిషన్‌ను 2021 ఏప్రిల్‌ 15 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. అయితే, అమెజాన్‌ లాంచ్‌ప్యాడ్‌ కింద ప్రస్తుతం 30 వేర్వేరు కేటగిరీల్లో 800 కి పైగా డెవలప్‌ చెందుతున్న బ్రాండ్లు భాగస్వామ్యం అయ్యాయి. ఈ బ్రాండ్లు 2 లక్షలకు పైగా ఉత్పత్తులను వివిధ అమెజాన్‌లో అమ్ముడవుతున్నాయి. ఇవి ప్రధానంగా హెల్త్‌, పర్సనల్‌ కేర్‌, బ్యూటీ అండ్‌ గ్రూమింగ్‌, గ్రోసరీ చెందినవి.

స్టార్టప్‌ సంస్థలకు ప్రోత్సాహం

అమెజాన్‌ ఇండియా ఎంఎస్‌ఎంఈ, సెల్లింగ్‌ పార్టనర్‌ ఎక్స్‌పీరియన్స్‌ డైరెక్టర్‌ ప్రణవ్‌ మాట్లాడుతూ ‘స్టార్టప్‌ సంస్థలను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం స్టార్టప్‌ ఇండియా, ‘మేకిన్‌ ఇండియా’ కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ కార్యక్రమాల ద్వారా ఎంటర్‌ప్రెన్యూయర్లను ప్రోత్సహిస్తూ ఆత్మనిర్భర్‌ భారత్‌ వైపు అడుగులు వేస్తోంది. వీటిలో నిర్వాహకులు దాదాపు కొత్త వారే ఉంటారు. వారికి గొప్ప ఐడియాలు అనుభవలేమితో మొదట్లోనే నష్టాల్లోకి వెళ్తుంటారు. వారు ఇక పై నష్టపోకుండా అమెజాన్‌ మెంటర్‌ కనెక్ట్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించాం.’’అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news